రవళి.. ఈ పేరు తెలియని వారు ఉండరు. తన బొద్దు అందాలతో, హావభావాలతో, నవ్వులతో అందరిని అలిరించిన నటి రవళి. ఒకప్పటి కుర్రకారును తన అందం, అభినయంతో ఉర్రుతలూగించింది. అప్పటి రోజుల్లో తెలుగు నటీమణులకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. కానీ ఇప్పటి రోజుల్లో తెలుగు వాళ్ళను ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. రవళి విషయానికి వస్తే అచ్చమైన అసలు సిసలైన తెలుగు అమ్మాయి.. రవళి పుట్టిన ఊరు గుడివాడ. అలా గుడివాడలో పుట్టిన రవళి మొదటగా మలయాళంలో సినీ రంగ ప్రవేశం చేసింది.

ఆ తరువాత తెలుగులో ఈవి విసత్యనారాయుణ దర్శకత్వం వహించిన ఆలీ బాబా అరడజను దొంగలు సినిమాతో ఎంట్రి ఇచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తరువాత రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాలో నటించింది. ఈ సినిమా రవళి కెరీర్ కు ప్లస్ అయింది. ఇప్పటికి, ఎప్పటికి “మా పెరటి జాం చెట్టు పళ్ళన్నీ.. ” అనే పాట వింటే చాలు వెంటనే రవళి గుర్తుకువస్తుంది. ఈ పాటలో రవళి నటన అమోఘం. మనం అందరం రవళి అని పిలుస్తున్నాము గాని రవళి అసలు పేరు శైలజ. సినిమాలో ప్రవేశించాక అదృష్టం కోసం అప్సరగాను ఆ తర్వాత రవళి గాను పేరు మార్చుకుంది.

ఒరేయ్ రిక్షా, పెళ్ళి సందడి, శుభాకాంక్షలు, వినోదం వంటి మంచి సక్సెసఫుల్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో, కన్నడలో పలువురు స్టార్ హీరోల సరసన నటించినది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న రవళి ఒక్కసారిగా స్టాలిన్ సినిమా ద్వారా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత నాగార్జున బాస్ సినిమాలో అలాగే మరి కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్ లో సైతం నటించింది. అంతేకాకుండా కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. జెమినీ టివీలో ప్రసారమైన నమో వేంకటేశ మంచి హిట్ అయ్యింది. తరువాత నటించిన సీరియల్స్ అంతగా హిట్ అవ్వలేదు. ఇక రవళి కుటుంబ సభ్యుల విషయానికి వస్తే.. రవళి మాత్రమే కాకుండా రవళి సోదరి, సోదరుడు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. రవళి సోదరి హరిత అందరికి సుపరిచితురాలే. అప్పట్లో చెల్లెలి పాత్రలో నటించి అందరిని మెప్పించింది. ఇప్పుడు తెలుగు బుల్లితెరపై తనకు సాటి వేరెవ్వరు లేరు అనే విధంగా తన హవా నడిపిస్తుంది. అత్తగా, తల్లిగా అనేక పాత్రల్లో నటిస్తుంది. హరిత భర్త జాకీ సైతం మన అందరికి బాగా తెలిసిన నటుడే.

రవళి సోదరుడు విజయ్ సైతం తెలుగులో కొన్ని సినిమాల్లో, అలాగే కొన్ని సీరియల్స్ లో నటిస్తున్నాడు. విజయ్ విషయానికి వస్తే తెలుగు ప్రేక్షకులకు పరిచయం తక్కువ. కానీ తమిళ్ లో సీరియల్ నటుడిగా విజయ్ కి మంచి పేరు ఉంది. ఇక హరిత కుటుంబం హైదరాబాద్ లో సెటిల్ అవ్వగా రవళి, విజయ్ లు మాత్రం చెన్నైలో సెటిల్ అయ్యారు. రవళికి అవకాశాలు తగ్గడంతో 2007 లో నీల్ కృష్ణ అనే సాఫ్ట్ వెర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకొని ప్రస్తుతం చెన్నైలో సెటిల్ అయ్యింది. పెళ్లి తర్వాత సినిమాలకు విరామం ఇచ్చింది. ఇక రవళి నీల్ కృష్ణలకు ఇద్దరు కుమార్తెలు.

రవళి కూతురు సైతం తల్లికి సరిసమానమైన అందంతో ఉంటుంది. హీరోయిన్ కి కావాల్సిన అన్ని లక్షణాలు కలిగి వుంది. అయితే రవళి మాత్రం ఇంతకు ముందులా లేదు. రవళిని చుసిన వారు అందరు నోరు వెళ్ళబెట్టి అసలు మేము చూస్తున్నది రవళి నేనా అని అంటున్నారు. రవళి ముందు నుండి చూడడానికి బొద్దు గానే ఉంటుంది. కానీ మునుపటి కళ తనలో కనిపించడం లేదు. అంతే కాదు చాలా లావు అయ్యి, చూడటానికి వికారంగా కనిపిస్తుంది. రవళి తన కుటుంబంతో కలిసి తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కావాలంటే మీరు కూడా ఆ ఫోటోలపై ఒక లుక్ వేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here