టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో తెలుగుతెరకి పరిచయం అయింది సదా. ఈ సినిమాలో హీరోగా నితిన్ నటించాడు. సాధారణంగా హీరోలకి ఓ మేనరిజం పెడుతుంటారు దర్శకులు. కానీ జయం సినిమాలో హీరోయిన్‌కి ఓ వెరైటీ మేనరిజం పెట్టి ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టాడు దర్శకుడు తేజ. ఈ సినిమాలో ‘వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ” అంటూ సదా చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. చెప్పాలంటే ఇప్పటికీ కొందరు అమ్మాయిలు ఈ డైలాగ్ వాడుతున్నారు. సాధారణంగా హీరోయిన్ అంటే మొదటి సినిమా నుంచే గ్లామర్ రోల్స్, ఎక్స్‌ఫోజింగ్ చేయడానికి రెడీ అవుతారు.

కానీ జయం అలాంటి సినిమా కాదు. అందుకే సదా లంగా ఓణిలో మెరుస్తూ కుర్రాళ్ళను, ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఇక సదాలో ఉన్న మరో ప్లస్ పాయింట్ డాన్స్. ఆమె అద్భుతంగా డాన్స్ చేస్తుంది. అందుకే సాంగ్స్‌లో చాలా ఆకట్టుకుంది. ముస్లిం కుటుంబంలో పుట్టిన సదా హీరోయిన్‌గా రాణించడం గొప్ప విషయం.

దానికి తన అమ్మా నాన్నలే కారణం. వాళ్ళ సపోర్ట్ వల్లే సదా స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. తన మొదటి సినిమా సూపర్ హిట్ అవడంతో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది. ప్రాణం, నాగ, తమిళంలో జయం, దొంగ దొంగది, ఇలా వరుస బెట్టి ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలలో నటించింది.

వరుసగా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ అనిపించుకుంది గానీ బ్యాక్ టు బ్యాక్ సాలీడ్ హిట్స్ మాత్రం దక్కలేదు. అన్నీ సినిమాలు యావరేజ్ అనే టాక్ దగ్గరే ఆగిపోయాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషాలలో సినిమాలు చేసిన సదా సౌత్‌లో బాగా పాపులారిటీని సంపాదించుకుంది.

చెప్పాలంటే 2002 లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన సదాకి పెద్దగా గ్యాప్ అంటూ ఎప్పుడూ రాలేదు. ఏదో ఒక భాషలో సినిమా చేస్తూనే ఉంది. అయితే హిట్స్ దక్కపోవడంతో బోల్డ్ క్యారెక్టర్స్ చేసేందుకు ఒప్పుకుంది.

ఈ క్రమంలో ఆమె నటించిన టార్చ్‌లైట్ అనే సినిమా వచ్చింది. తమిళంలో వచ్చిన ఈ సినిమాలో సదా ఓ వేశ్య పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకాధరణ పొందలేదు. ఇలా సినిమాలు చేస్తూనే బుల్లితెర మీద డాన్స్ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అయితే పెళ్ళి తర్వాత ప్రియమణి, కాజల్ అగర్వాల్, మీనా లాంటి వారు హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటూ మళ్ళీ మంచి క్రేజ్‌తో సత్తా చాటుతున్నారు. దాంతో సదా కూడా మళ్ళీ హీరోయిన్‌గా అవకాశాల కోసం అన్నీ విధాల ప్రయత్నాలు చేస్తోంది.

ఈ క్రమంలోనే ఈ మధ్య బాగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ మేకర్స్ ని ఆకట్టుకునే పనిలో పడింది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్ చేస్తూ వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. మరి సదాకి టాలీవుడ్ మేకర్స్ తను ఆశించినట్టుగా హీరోయిన్ అవకాశాలు ఇస్తారా లేదా చూడాలి. నిజంగా తనకి సీనియర్ స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా సినిమాలను చేస్తూ ఫాంలో ఉండటం ఖాయం. చూడాలి మరి సదా టాలెంట్‌ను ఎవరు గుర్తు చేసుకుంటారో.

































