అక్కినేని నాగేశ్వరావు గారి సినిమా ప్రయాణం, కుటుంబ ప్రయాణం, ఆయన ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న విషయాలు ఇవన్నీ ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే.. అయితే నాగేశ్వరావు గారు పుట్టినప్పటి నుండి ఆయనకు పెళ్లయ్యే దాకా ఏం జరిగిందో ఎక్కువమందికి తెలియదు.. సో, ఇప్పుడు తెలుసుకుందాం..

అక్కినేని నాగేశ్వరావు గారు 20 సెప్టెంబర్ 1924 లో కృష్ణాజిల్లా రామాపురంలో జన్మించారు. వీళ్లది మధ్యతరగతి కుటుంబమే.. అయితే నాగేశ్వరావు కి నాలుగెళ్ల వయసున్నప్పుడే వాళ్ళ తండ్రిగారు మరణించారు. దాంతో అతని చిన్నప్పుడే వాళ్ళ అన్నదమ్ముళ్లకి ఇతనికి ఆస్తి పంపకాలు జరిగాయి. వారి దగ్గరున్న మొత్తం ఆస్థిని పంచితే అన్నదమ్ములందరికి తలో ఒక 5 ఎకరాలు భూమి వచ్చింది. అప్పట్లో ఎకరం 600 రూపాయలు అంటే 5 ఎకరాలు కలిపితే 3000 రూపాయలు అనమాట. అయితే వాళ్ళ కుటుంబంలో ఎవరు చదవుకోక పోవడం వలన నాగేశ్వరావు ని ఆ 3000 వేల రూపాయలతో చదవించాలని వాళ్ళింట్లోవాళ్ళు ముందు అనుకున్నారట.. కానీ స్కూల్ కి వెళ్లినా చదవు అబ్బకపోతే, ఉద్యోగం రాకపోతే ఎలా.. ఉన్న ఆస్తి కూడా పోతుందని బాగా అలోచించిన అక్కినేని అమ్మగారు చదవుని మధ్యలోనే మాన్పించేసారు. ఇక అప్పట్లో అక్కినేని పాటలు పాడటం, కోలాటం ఆడటం లాంటివి చేసేవాడు.. దాంతో కనీసం వాటిల్లో అయినా పైకి ఎదుగుతాడు అనుకుని నాటకాల్లో చేర్పించమని అక్కినేని వాళ్ళ అన్నయ్యకి చెప్పింది. దాంతో 9 సంవత్సరాల వయసులో తొలిసారిగా ముఖానికి రంగు వేసుకున్నాడు. అప్పటి నుంచి 19 ఏళ్ల వయసు వచ్చే వరకూ నాటకాల్లో నటిస్తూనే ఉన్నాడు. మొదటి ఒక్కో నాటకానికి అర్ధ రూపాయి తీసుకున్నా.. చిన్న చిన్నగా ఆదాయం పెరిగింది.. అర్ధరూపాయ నుండి 5 రూపాయల వరకు ఎదిగాడు. ఆ తర్వాత అప్పుడే సినిమా రంగం అభివృద్ధి చెందుతుండటంతో మెల్లగా సినిమాల్లో కూడా అవకాశాలను అందిపుచ్చుకోని అక్కడ కూడా బాగా రాణించాడు.

సో, చేతినిండా నాటకాలు, సినిమాలు, రెండుచేతులు సంపాదన అంతా బాగానే ఉంది.. ఇక పెళ్ళిచేసుకుంటే బావుంటుందని సంబంధాల కోసం వెతకడం మొదలుపెట్టారు.. అయితే నాగేశ్వరావు గారిని పెళ్లిచేసుకోవడానికి ఏ అమ్మాయి కూడా ముందుకు రావడం లేదు. అప్పట్లో సినిమా వాళ్ళకి పిల్లనివ్వకూడదు, అక్కడ చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది భ్రమలో ఉండేవారు. అలా ఎంతవెతికిన పిల్ల దొరకలేదు. చివరికి అక్కినేని వాళ్ళ మేనమామ కూడా తన కూతురిని అక్కినేనికి ఇచ్చి పెళ్లి చేయను అని చెప్పాడు. దాంతో కాస్త నిరాశ చెందిన నాగేశ్వరావు గారికి అప్పుడు తెలియదు అయన లైఫ్ లోకి అన్నపూర్ణమ్మ లాంటి దేవత రాబోతుందని… మాములుగా పుణ్యంకొద్ది పురుషుడు అంటారు కదా కానీ ఇక్కడ నాగేశ్వరావు గారి పుణ్యం కొద్దీ అన్నపూర్ణమ్మ లాంటి భార్య ఆయన జీవితంలోకి వచ్చింది.

ఆ పెళ్లి ఎలా జరిగిందంటే ఒకరోజు పేకాటలో ఫ్రెండ్ అయిన ఒకతను మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం ఎవరైనా ఉంటే చెప్పండి అని అడిగారట.. దాంతో అక్కడ వున్నవారు అక్కినేని నాగేశ్వరావు అని ఒకబ్బాయి ఉన్నాడు చాల బుద్దిమంతుడు అని చెప్పడంతో అక్కినేని మామగారు అన్నపూర్ణమ్మను ఇచ్చి నాగేశ్వరావు గారికి పెళ్లి చేయడానికి ముందుకు వచ్చారు. అయితే అతను సినిమావాడు ఒద్దు అన్నపూర్ణమ్మ గొంతు కోయొద్దు అంటూ కొంతమంది బంధువులు ఎంత బలవంతం చేసిన అయన వినిపించుకోకుండా నాగేశ్వరావు కి అన్నపూర్ణమ్మకు దగ్గరుండి పెళ్ళిచేసారు అక్కినేని మామగారు. ఇక ఆరోజు నుండి అన్నపూర్ణమ్మ నాగేశ్వరావు గారి అడుగు జాడల్లో, కష్టాల్లో కన్నీళ్ళలో తోడుగా ఉంటూ.. ఈయన షూటింగ్స్ లో బిజిగా ఉన్న కూడా ఆమే తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అందుకే అన్నపూర్ణమ్మని ఒక మంచి భార్య అనడం కంటే ఒక మంచి స్త్రీ అని అనాలి.

అక్కినేని నాగేశ్వర రావు గారి భార్యగా అన్నపూర్ణ అడుగుపెట్టిన తర్వాతే ఆయన జీవితం పరిపూర్ణంగా మారింది. పూర్ణమ్మ తోడుగా ఉండడం వల్లనే నాగేశ్వరావు గారి నటన కళా పరిపూర్ణమైందని చెప్పొచ్చు. అయితే అప్పటి రొమాంటిక్ హీరో ఎవరు అంటే అందరూ నాగేశ్వరావు గారి పేరే చెప్పేవారు. కానీ నాగేశ్వరావు గారికి అమ్మాయిలన్న అమ్మాయిలతో మాట్లాడాలన్నా చాల చాలా సిగ్గు. అందుకే షూటింగ్ స్పాట్ లో కూడా ఎవరితో మాట్లాడారట.. ఆలా మాట్లాడకపోయేసరికి అక్కినేని గారిని అసలు మగాడే కాదు అని కొంతమంది హేళన చేసేవారట.. అప్పుడు ఆయనకు బాధగా అనిపించేదట. అలాంటి పరిస్థితులలో అన్నపూర్ణమ్మ అక్కినేని జీవితంలోకి అడుగు పెట్టింది. తను మాములుగా రాలేదు.. ఎన్నో సుఖ సంతోషాలను, ఎంతో అదృష్టాన్ని తన వెంట తీసుకుని వచ్చింది. ఓర్పులో భూదేవి అన్నపూర్ణమ్మ. హీరోల భార్యలకు ఓర్పు అనేది చాలా ముఖ్యం. అందులోని అక్కినేని లాంటి రొమాంటిక్ హీరో భార్యకు మరింత ఓర్పు ఉండాలి. అలా వుంది కాబట్టే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక అన్నపూర్ణమ్మ గారి పేరుమీద అన్నపూర్ణ స్టూడియో హైదరాబాద్ లో ఉన్న సంగతి మనందరికి తెలిసిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here