సాధారణంగా కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్ అంటే పాపులర్ హాలిడే స్పాట్స్ కే వెళ్ళటానికి ఎక్కువ ఇష్టపడతారు. ఈ ప్రపంచం చాలా అందమయినది ఇంకా విశాలమయినది. ప్రపంచం లో అన్ని ప్రదేశాలు చూడాలంటే జీవితకాలం పడుతుంది. పాపులర్ హాలిడే స్పాట్స్ లో మాల్దీవ్స్ ఒక్కటి. సాధారణంగా అక్కడ హనీమూన్ ఎంజాయ్ చెయ్యటానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ ఇకమీదట కొత్త జంట అక్కడికి వెళ్లాలంటే కాస్త జాగ్రత్త పడాలి, ఎందుకంటే మాల్దీవ్స్ కి హనీమూన్ వెళ్లి వచ్చిన జంటల్లో ఎక్కువమంది విడాకులు తీసుకున్నారంట.

వినడానికి ఆశ్చర్యంగా, విడ్డూరంగా ఉన్న ఇది నిజం. ఓ సర్వే ద్వారా తెలిపిన నిజం ఇది. కాబట్టి కొత్తగా పెళ్ళైన జంటలు హనీమూన్ ప్లాన్ చేసుకుంటే, కొంచెం జాగ్రత్త వహించండి. లేదంటే మీ హనీమూన్ వల్ల మీ లైఫ్ చేంజ్ అయ్యే ప్రమాదం ఉంది. మాల్దీవ్స్ కు హనీమూన్ వెళ్లి వచ్చిన జంటల్లో ఒక 20శాతం మంది విడాకులు తీసుకున్నారని డేటా తెలిపింది. అక్కడికి ఎంజాయ్ చెయ్యటానికి వెళ్తే ఇలా ఆఖరుకి బంధానికే వీడుకోలు చెప్పడం ఏమైనా అర్ధముంటుందా. కాబ్బటి మీ హనీమూన్ కి ఒక్క మాల్దీవ్స్ కు మాత్రమే వెళ్లాలా.. ప్రపంచంలో ఇంకా ఎంతో అందమయిన హనీమూన్ డెస్టినేషన్స్ దేశ విదేశాల్లో అనేకం ఉన్నాయి. వాటిలో ఏదైనా ప్రాంతాన్ని ఎంచుకోని, మీ జీవితపు మధుర క్షణాలని ఆస్వాదించండి.

ఇప్పటికి వేల కొద్దీ విడాకులు

కంపేర్ డాట్ బెట్ అనే పోర్టల్ ద్వారా దాదాపు 3,100 మంది విడాకులు తీసుకున్న దంపతులను ఇంటర్వ్యూ చేసి, పెళ్లి తరువాత వారి హనీమూన్ ఎక్కడ జరిగిందనే విషయం తెలుసుకోగా వీరిలో 620 మంది అంటే 20శాతం మంది మాల్దీవ్స్ కు హనీమూన్ వెళ్లినట్టు తెలిపారు. బ్రిటన్ కు చెందిన స్టేకేషన్ హాలిడే డేటా ప్రకారం బ్రిటన్ లో హనీమూన్ చేసుకున్న జంటలు ఇప్పటిదాకా విడిపోలేదంట. ఇదేదో బాగుంది కదూ. తరువాత యూరోపియన్ డెస్టినేషన్స్ అయిన వెనిస్, రోమ్ వంటివి కూడా వీడిపోని జాబితాలో ఉన్నాయ్. కాబ్బటి ఇకమీదట కొత్త జంటలు హనీమూన్ ప్లాన్ చేసేముందు ఈ విషయాలు గుర్తు పెట్టుకొని చేసుకుంటే మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here