ప్రస్తుతం సోషల్ మీడియా కారణంగా ప్రపంచం మొత్తంలో ఏ విషయమైనా సరే నిమిషాల్లో ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. అయితే సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందిన కొన్ని విషయాలు మాత్రం అలా తెలియకుండా అలా ఉండి పోతాయి. అయితే ఆ తర్వాత ఏదో ఒక సమయంలో పూర్తి వివరాలు బయటకు వస్తాయి. అయితే ఇలా చాలా సినిమా వారి జీవితాలకు సంబంధించి మొదట బయటికి రాకపోయినా ఆ తర్వాత ఆ విషయాల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్న వారి నుండి ఏదో ఒక సమయంలో పూర్తి వివరాలు బయటకు వస్తాయి. అటువంటి జీవితానికి సంబంధించి హీరో చరణ్ రెడ్డి జీవితం దగ్గరగా ఉంటుంది.

ఈయన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం చెందినవారని సమాచారం. 2001 సంవత్సరంలో రామోజీరావు కి సంబంధించిన ఉషాకిరణ్ మూవీస్ లో ఇష్టం అనే సినిమా ద్వారా వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో చరణ్ రెడ్డి మాత్రమే కాకుండా హీరోయిన్ శ్రియ శరణ్ కూడా వెండి తెరకు పరిచయం అయ్యింది. అంతే కాదు ఆ సినిమా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కూడా పరిచయమయ్యారు. ఈయన ఆ తర్వాత ఇష్క్, 24, మనం సినిమాలను నిర్మించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇష్టం సినిమా మాత్రం అసలు బాగా ఆడలేదు. దీంతో హీరో చరణ్ రెడ్డి సినిమాలలో నటించడం మానేశారు.

అయితే ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, హీరో సుమంత్ సోదరి అయిన సుప్రియ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. సుప్రియ కూడా పవన్ కళ్యాణ్ నటించిన మొట్ట మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ తర్వాత సుప్రియ హీరోయిన్ గా నటించడం మానేసి ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో సంబంధించి వ్యవహారాలను చూడడం మొదలుపెట్టింది.

అయితే దురదృష్టవశాత్తు చరణ్ రెడ్డి కేవలం తన 36వ ఏటనే మృతి చెందారు. అయితే ఆయన మరణించే సంవత్సరం తన భార్య సుప్రియ తో విడాకులు కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే మరణానంతరం ఆయన ను పరిశీలించిన వైద్యులు తీవ్ర గుండెనొప్పితో మరణించాడు అని తేల్చారు. గుండెనొప్పి రావడంతో హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసిన మల్లి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో దాంతో డాక్టర్లు రక్షించలేక పోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయనకు శవ పరీక్షలు ఉస్మానియా వైద్య కళాశాలలో నిర్వహించారు. అయితే ఫోరెన్సిక్ బృందం నిర్వహించిన శవ పరీక్షలో ఆయన పూర్తిగా తాగుడుకు బానిస కావడం వల్లనే ఆయన లివర్ పాడవడం ద్వారానే ఆయన మరణించినట్లు తెలిపారు. అయితే ఆయన నటించిన ఇష్టం సినిమాకి డైరెక్టర్ విక్రమ్ తో పాటు రాజ్ కుమార్ కూడా సహాయ దర్శకుడిగా పని చేశారు.

అలా ఇష్టం సినిమాతో తన కెరీర్ నిర్మించుకున్న చరణ్ రెడ్డి ఆ తర్వాత కుటుంబ సమస్యల నేపథ్యం భాగంగా చివరికి తాను మందుకు బానిసైన అయి చివరికి మరణించడం జరిగింది. చరణ్ చనిపోయే వరకు ఎక్కడ తన అత్తగారింటి పేరును కానీ కాంటాక్ట్స్ ని కానీ వాడుకోకపోవడం వల్లనే ఆయనకు ఎక్కువగా అవకాశాలు రాలేదని అలాగే మీడియా కూడా అప్పట్లో పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదని నాగార్జునకు కొడుకు వరస అయినా కూడా అయన కూడా ఎక్కడ చరణ్ పేరును ప్రస్తావించకపోవడం నిజాన శోచనీయం. చరణ్ తోపాటు ఇష్టం సినిమా లో హీరోయిన్ గా నటించిన శ్రేయ శరణ్ మాత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో అగ్రతారల సరసన టాప్ హీరోయిన్ గా చలామణి అయ్యింది. ప్రస్తుతం ఆవిడ విదేశీయుడిని పెళ్లి చేసుకుని అక్కడే నివసిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here