సినిమా ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఉంటుందని కొంతమంది వాపోతుంటారు. కొంతవరకు అది నిజమని ఒప్పుకొని తీరాల్సిందే. ఆడవాళ్ళు డైరెక్షనా.. ఇక సినిమా మొదలైనట్టే.. బొమ్మ పడినట్టే అని కాస్త చులకనగా ఎగతాళిగా మాట్లాడం చాలా సందర్భాలలో జరిగాయి. వాటికి తగ్గట్టుగానే చాలామంది ఆడవారు ఒక్క సినిమా రంగంలోనే కాదు పలు రంగాలలో, రాజకీయాలలో సత్తా చాటుతున్నారు. కొన్ని రంగాలలో మగవారికంటే ఆడవారే గొప్ప గొప్ప విజయాలను సాధిస్తున్నారు. మగవారికంటే ఆడవారు ఎందులోనూ తీసిపోరు.. తక్కువ కారు అని నిరూపిస్తున్నారు.

సినిమా తీయడం అంటే అంత సులభం కాదు.. మీకెందుకు డైరెక్షన్ అని నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొన్న సీనియర్ దర్శకురాలు, నటీమణి సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల అందరికీ మైండ్ బ్లాకయ్యేలా సినిమాలను తీసి శభాష్ అనిపించకున్నారు.

ఇక అంతకు ముందే మరో అగ్ర కథానాయిక భానుమతి రామకృష్ణ గారు హీరోయిన్‌గా పాపులారిటీ వచ్చాక దర్శకురాలిగా పలు సూపర్ హిట్ సినిమాలను రూపొందించారు. అంతేకాదు ఆవిడ పాటల రచయితగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో ఓనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పట్లో భానుమతి గారి పేరు చెప్తేనే ఒణికిపోయిన వారున్నారు.

అంతగా ఆవిడ క్రమశిక్షణతో ఎన్నో విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత కాలంలో లేడీ డైరెక్టర్ ఇండస్ట్రీకి అంతగా రాకపోయిన ప్రముఖ పీ ఆర్వో బి.ఏ.రాజు సతీమణి బి. జయ గారు దర్శక, రచయితగా సత్తా చాటారు. ఆవిడ కెప్టెన్ కుర్చీలో కూర్చొని సెట్‌లో అందరినీ గడగడలాడించారు. అంతేకాదు ఇండస్ట్రీకి హీరో హీరోయిన్స్‌గా కొత్త వారిని పరిచయం చేసిన ఘనత కూడా జయ గారు సంపాదించుకున్నారు. నేడు ఆవిడ మనముందు లేకపోయినా ఆవిడ సినిమాలు.. ఆ సినిమాల ద్వారా పరిచయమైన వారు స్టార్స్‌గా వెలుగుతున్నవారు ఇండస్ట్రీలో ఉన్నారు.

ఈ క్రమంలోనే లేడీ డైరెక్టర్ సుధ కొంగర అద్భుతమైన సినిమాలను తీస్తూ గొప్ప దర్శకురాలిగా కేవలం సౌత్‌లో మాత్రమే కాకుండా బాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకున్నారు. ఒకే కథను తెలుగు, హిందీ, తమిళ భాషలలో రూపొందించి అవార్డులను.. విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్నారు. గత చిత్రం సూర్యతో తీసి ఇటు తెలుగు, అటు తమిళంలో భారీ హిట్ అందుకున్నారు.

ఈ క్రమంలోనే మరికొంతమంది లేడీ డైరెక్టర్ ఇండస్ట్రీలో సత్తా చాటడానికి సిద్దమవుతున్నారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో ఇటీవల వచ్చిన పెళ్లి సందడి సినిమాతో గౌరీ రోనంకీ అనే లేడీ డైరెక్టర్ పరిచయమయ్యారు.

మూవీ మేకింగ్ పరంగా ఆమెకి మంచి మార్కులే పడ్డాయి. అలాగే త్వరలో లక్ష్మీ సౌజన్య అనే మరో లేడీ డైరెక్టర్ రాబోతున్నారు. యంగ్ హీరో నాగ శౌర్య – రీతూ వర్మ జంటగా ఆమె వరుడు కావలెను అనే సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. చిత్ర యూనిట్ మొత్తం వరుడు కావలెను సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణంలో మీట్ క్యూట్ అనే డిఫరెంట్ మూవీ ఒకటు షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాతో నానీ.. తన సోదరి దీప్తి గంటాను దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు లేడీ డైనమిక్ డైరెక్టర్ హవా ఎక్కువవుతోంది.































