చూడచక్కని రూపం, పదహారణాల తెలుగు అమ్మాయిల, తరచూ పలకరించే పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. మలయాళ సినీ ప్రొడ్యూసర్ సురేష్ కుమార్, అలాగే తమిళ నటి మేనకల కుమార్తె కీర్తి సురేష్. 2013లో మలయాళ చిత్రం “గీతాంజలి” చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన కీర్తి సురేష్, తెలుగులో “నేను శైలజ” అనే చిత్రంలో రామ్ తో సరిజోడి గా నటించారు.

ఆ తర్వాత అనేక తెలుగు చిత్రాల్లో నటించారు. కానీ “మహానటి” చిత్రం కీర్తి సురేష్ కి మంచి పేరు తీసుకువచ్చింది. మహానటి చిత్రానికిగాను కీర్తిసురేష్ కి జాతీయ అవార్డు వచ్చింది. అనతికాలంలోనే అగ్ర హీరోలతో నటించే అవకాశాన్ని పొందింది. పవన్ కళ్యాణ్ తో “అజ్ఞాతవాసి” చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఒక దశలో చిరంజీవికి జోడిగా “ఆచార్య” చిత్రంలో కనిపిస్తుందని ఆ మధ్య కాలంలో వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరికి ఆచార్య చిత్రంలో కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.

అయితే కీర్తి సురేష్ తల్లి మేనక, చిరంజీవితో ఒకప్పుడు సరిజోడీగా నటించారు. మేనక తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి దాదాపు వందకుపైగా చిత్రాల్లో నటించారు. ఇంద్రధనస్సు, సుబ్బారావుకు కోపం వచ్చింది లాంటి తెలుగు చిత్రాల్లో ఆమె నటించారు. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తన తల్లిదండ్రులకు మేనక ఒక్కరే కూతురు. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో 1963లో పద్మావతి జన్మించారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన అసలు పేరు పద్మావతి స్థానంలో మేనక అని పేరు మార్చుకున్నారు. దాదాపు 150 చిత్రాల వరకు నటించిన మేనక 1987లో ప్రఖ్యాత మలయాళ ప్రొడ్యూసర్ సురేష్ కుమార్ ని వివాహం చేసుకున్నారు.

ఆ తర్వాత రేవతి, కీర్తి సురేష్ అనే ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చారు. కీర్తి సురేష్ మలయాళం తమిళ కన్నడ తెలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుండగా, రేవతి సురేష్ మలయాళం సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతోంది. అయితే 1980 ఏ.వి.ఎమ్ ప్రొడక్షన్స్, ఎం.రాజశేఖర్ దర్శకత్వంలో “పున్నమినాగు” చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో నరసింహరాజు, రతి అగ్నిహోత్రి చిరంజీవి, మేనక హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయినా నాగులుగా చిరంజీవి నటించారు. అలాగే పూర్ణిమ పాత్రలో మేనక నటించారు. 1980లో నాగుపాము కథతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది.



























