నంది అవార్డుల ఫంక్షన్ జరిగిన వజ్రోత్సవాలు జరిగిన, సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన ఆ కార్యక్రమం జరగబోయే ముందు మిమిక్రీ శివారెడ్డి తన అద్భుతమైన ధ్వని అనుకరణ తో ప్రేక్షకులను మైమరిపిస్తాడు. వేదిక పై లేని రాజకీయ నాయకులను సినిమా నటులను తనదైన గొంతుతో వారి యొక్క ఉనికిని గుర్తు చేస్తాడు.

ఆ మధ్య కాలంలో శివారెడ్డి లేని రాజకీయ సభ గాని, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ గాని జరగలేదేమో అనిపిస్తుంది. 1996లో సానా యాదిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పిట్టలదొర సినిమాలో శివారెడ్డి చిన్న పాత్ర వేశారు. ఆ తర్వాత దాదాపు మూడు సినిమాల్లో సానా యాదిరెడ్డి శివారెడ్డికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. మీనా ప్రధాన పాత్రలో పోకిరి బాబురావు నిర్మించిన అమ్మాయి కోసం సినిమాలో రవితేజ, వినీత్, ఆలీ ఈ ముగ్గురితో తో కలిసి శివారెడ్డి నటించారు.

తర్వాత విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో శివారెడ్డి మిమిక్రీ షోలు చేశారు. అలా చేస్తూనే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ వేయడం ఇలా కొన్ని సినిమాల్లో నటించిన కూడా ఒక ఖచ్చితమైనటువంటి బ్రేక్ శివారెడ్డికి ఇప్పటివరకు రాలేదు. శివారెడ్డికి తగినన్ని ఆఫర్స్ రాకపోవడానికి సినిమా ఇండస్ట్రీ లోనే ఓ ప్రముఖ నటుడు కారణమని శివారెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ నటుడి పేరు చెప్పడానికి శివారెడ్డి అంతగా ఇష్టపడలేదు.

మిమిక్రీ ఆర్టిస్టులు అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులను అనుసరించడం వలన తమకంటూ ఓ ప్రత్యేకమైన డిక్షన్, బాడీ లాంగ్వేజ్ అంటూ ఏమి ఉండదు. ఈ క్రమంలో సినిమాలో ఏదైనా ఓ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు వాళ్లకు తెలియకుండానే ఏదో ఒక సినిమా యాక్టర్ ని అనుకరిస్తూ ఉంటారు.. స్పెషల్ డిక్షన్, పెక్యులర్ డైలాగ్ డెలివరీ లేకపోవడం వలన ఫలాన పాత్రకు సరిపోతాడు అనే సిచువేషన్ ఉండకపోవడం తో శివారెడ్డికి తగినన్ని అవకాశాలు లేక సినిమాలు తగ్గిపోతున్నాయి అనేది మరో విశ్లేషణ.































