సూపర్ స్టార్ రజినీకాంత్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పూర్తిచేసి 1975 లో కె.బాలచందర్ దర్శకత్వంలో అపూర్వ రాగంగల్ అనే తమిళ సినిమాలో శ్రీవిద్యకు ఒక దుష్ట భర్తగా రజనీకాంత్ నటించడం జరిగింది. ఆ తర్వాత 1976 తెలుగులో అంతులేని కథ, 1977 లో చిలకమ్మ చెప్పింది.ఆమె కథ, అందమైన అనుభవం, అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే, మాయదారి కృష్ణుడు, రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి తెలుగు సినిమాలలో నటించడం జరిగింది. భాష, నరసింహ, శివాజి, రోబో, 2.0 లాంటి తెలుగు డబ్బింగ్ చిత్రాలు రజనీకాంత్ కు మంచి పేరు తీసుకు వచ్చాయి. ఆయన నటనకు గాను పద్మవిభూషణ్, పద్మభూషణ్ 2020లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను పొందడం జరిగింది. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి, మోహన్ బాబులతో రజినీకాంత్ కు మంచి స్నేహ సంబంధాలున్నాయి.

నిజ జీవితంలో మంచు భక్తవత్సలం నాయుడు, సినీ జీవితంలో మోహన్ బాబు గా పిలువబడే ఈ కలెక్షన్ కింగ్ దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించి కేంద్ర ప్రభుత్వం చే 2007లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. స్వర్గం నరకం చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ డైలాగ్ కింగ్ అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రతి కథానాయకుడిగా ఆ తరువాత కథానాయకుడిగా నిర్మాతగా దాదాపు 70కి పైగా చిత్రాలు చేయడం జరిగింది. మోహన్ బాబు నటిస్తూనే నిర్మాత గా మారారు. అలా తమ సొంత బ్యానర్ లో ఆయనే హీరోగా అల్లుడుగారు 1990లో విడుదలై మంచి విజయాన్ని ఇవ్వడంతో అసెంబ్లీరౌడీ, రౌడీ గారి పెళ్ళాం, బ్రహ్మ, మేజర్ చంద్రకాంత్ లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. 1994లో డిటెక్టివ్ నారద,కుంతీపుత్రుడు,ఎం ధర్మరాజు ఎం.ఏ,అల్లరి పోలీస్,పుణ్యభూమి నాదేశం లాంటి వరస ఫ్లాప్ లతో మోహన్ బాబు కష్టాల్లో ఉన్నప్పుడు…

సూపర్ స్టార్ రజినీకాంత్ పిలిచి తమిళంలో విజయవంతమైన “నాట్టమై” అనే విజయవంతమైన చిత్రం రీమేక్ హక్కుల్ని మోహన్ బాబుకు ఇప్పించారు. అలాగే రజినీకాంత్ రాజమండ్రి కి ట్రైన్ లో వచ్చి కష్టాల్లో ఉన్న మోహన్ బాబును కలిసి పెదరాయుడు సినిమా నిర్మించడానికి దాదాపు 45 లక్షల రూపాయలను సహాయం చేయడం జరిగింది. తిరిగి సినిమా విజయవంతమైన తర్వాత ఇవ్వమని మోహన్ బాబు చేతిలో సూట్ కేసు పెట్టారు. రజినీకాంత్ స్నేహానికి ఎంతో విలువనిస్తాడని ఈ సంఘటన ద్వారా అర్థమవుతుంది.



























