టాలీవుడ్ లో ఇలా వచ్చి అలా కనుమరుగైన హీరోలు చాలా మందే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో నేట్టుకురావాలంటే టాలెంట్ తో పాటూ కూసింత లాక్ కూడా ఉండాలి. కొందరు ఎంట్రీ సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని అతి తక్కువ కాలంలో సూపర్ క్రేజ్ సంపాదించి ఎంత తొందరగా ఫేం లోకి వచ్చారో అంతే తొందరగా ఫేడ్ అవుట్ అయిపోతారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు హీరో వినీత్. ‘ప్రేమ దేశం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు హీరో వినీత్.

సరిగమలు సినిమాతో తెలుగునాట అరంగేట్రం చేసిన వినీత్.. ప్రేమదేశం సినిమాతో తిరుగులేని స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనంతో ఎనలేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ సినిమాతో సంపాదించిన క్రేజ్‌తో కొన్ని సినిమాలలో నటించినా హీరోగా ఎక్కువకాలం నిలదొక్కుకోలేకపోయాడు. సినీనటి శోభనకు తమ్ముడైన వినీత్ కు సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నాకూడా అదృష్టం కలిసిరాలేదు. అంతేకాకుండా స్వతహాగా మలయాళి అయిన వినీత్‌కు తెలుగు భాషపై పెద్దగా పట్టులేకపోవడం కూడా అయనకు తెలుగులో అవకాశాలను దూరం అవ్వడానికి కారణం అయింది.
డబ్బింగ్ చెప్పుకోవడానికి వీలునప్పటికీ.. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన వినీత్ కి లవర్ బాయ్, డాన్సర్ కథలు మాత్రమే ఎక్కువగా వచ్చేవి. అలా చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ టాక్ రావడంతో వినీత్‌కు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ప్రేమ పల్లకి, ఆరో ప్రాణం, రుక్మిణి, వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్, పాడుతా తీయగా, వంటి సినిమాలు చేసినా అందులో ఒక్క హిట్ కూడా లేకపోవడం మరో కారణం. ఇక చేసేది ఏమిలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి లాహిరి లాహిరి లాహిరిలో, బాపు బొమ్మకు పెళ్ళంట వంటి చిత్రాలలో నటించాడు. అదే సమయంలో మలయాళంలో వరుస అవకాశాలు రావడంతో అయన తెలుగు ఇండస్ట్రీ వైపు చూడడం మానేసాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇటీవల నితిన్ హీరోగా నటించిన రంగ్ దే చిత్రంలో కనిపించాడు. మంచి పాత్రలు వస్తే తప్ప తెలుగులో నటించనని వినీత్ భావిస్తున్నారట. చూద్దాం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానైనా వినీత్‌కి తెలుగులో మంచి గుర్తింపు రావాలని ఆశిద్దాం.



























