సినిమా ప్రపంచం అనేది రంగుల ప్రపంచం. ఒకసారి దీనిలోకి అడుగుపెట్టాక బయటకు రావడం అంటే కష్టమే. అప్పట్లో హీరోగా నటించిన వాళ్ళు ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు లేక దొరికిన పాత్రతో సర్దుకుపోతున్నారు. కొన్ని కొన్ని సార్లు అవకాశాలు వాళ్ళని వెతుకుంటూ వస్తాయి. మరికొన్ని సార్లు వాళ్లే అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళతారు. అలాంటి వాళ్లలో హీరో సురేష్ ఒకడు.

సురేష్ మల్టి టాలెంటెడ్ హీరో. నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా. దాదాపు సురేష్ 270 పైగా చిత్రాలలో నటించాడు. ఒకానొక కాలంలో చాలా సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకుల ఆదరణ కూడా పొందాడు. అప్పట్లో హీరో.. తర్వాత విలన్, ఇప్పుడు సపోర్టింగ్ పత్రాలలో కూడా నటిస్తున్నాడు. మరోపక్క బుల్లితెర మీద సీరియల్స్ లో కూడా నటిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఆయన 1963 వ సంవత్సరంలో ఆగస్టు 26 వ తేదీన శ్రీ కాళహస్తిలో జన్మించాడు. ఆయన తల్లి తండ్రులు గోపినాధ్, రాధా దేవిలు. అయితే ఇతని తాతగారు అప్పట్లో సినిమాలకు పాటలు, పద్యాలు రాసేవాడు. ఆ తరువాత ఉపాధ్యాయ ఉద్యోగం రావడంతో అందులో సెటిల్ అయిపోయాడు. నటుడు సురేష్ 1981 లో పన్నీర్ పుష్కాన్గలం అనే తమిళ్ సినిమాలో నటించాడు. అయితే అదే సంవత్సరంలో రామదండు అనే తెలుగు సినిమాలో కూడా నటించాడు.

అయితే తొలి చిత్రంతోనే మంచి నటుడిగా పేరుపొందిన సురేష్ కి వరుసగా తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో బిజీ అయిపోయాడు. ఆ తరువాత విలన్ క్యారెక్టర్లలో కూడా నటించి అందరిని మెప్పించాడు. ఆ తరవాత 2002 వ సంవత్సరంలో రాఘవ అనే సినిమాను కూడా ప్రొడ్యూస్ చేసాడు. అలాగే కొన్ని సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు. తరువాత అనిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే సినిమాల్లో బిజీ గా ఉండడం, ఇంట్లో ఎక్కువ సమయం భార్యతో గడవకపోవడం వంటి అంశాల వల్ల ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఇద్దరు కూడా మళ్ళీ చేసుకోవడం విశేషం అనే చెప్పాలి.

ఆపై సురేష్ రాజేశ్వరి అనే మహిళను రెండవ పెళ్లి చేసుకున్నాడు. సురేష్ పెళ్లి చేసుకున్న రాజేశ్వరి ఒక రచయత అలాగే నిర్మాత కూడా. సురేష్ నటించే సీరియల్స్ కు రైటర్ గా పనిచేస్తారు రాజేశ్వరి. సురేష్ 2014లో మై నేమ్ ఈజ్ మంగతాయారు, మా ఇంటి మహాలక్ష్మి, రాజేశ్వరీ కల్యాణం, నాటకం.. ఇలా ఏడు సీరియల్స్ నిర్మించాడు. అయితే ఈ దంపతులకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. వీరి అబ్బాయి పేరు నిఖిల్ సురేశ్. ప్రస్తుతం అమెరికాలో ఎంబీఏ చేస్తున్నాడు. నిఖిల్ కు సినిమాల మీద పెద్ద ఆసక్తి లేదు. నావీలో ఉద్యోగము చేయాలని అనుకుంటున్నాడు. సురేష్ మొదటి భార్య అనిత తో విడాకులు తీసుకున్నాగాని ఇప్పటికీ వీరు స్నేహంగా ఉంటారు. ఇతని నుండి విడిపోయిన తర్వాత ఆమె మరో వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. అయితే ఎప్పుడు వెళ్లినాగాని ఇతడు వారింట్లోనే అతిధిగా ఉంటాడని పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.































