సినిమా రంగంలోకి అడుగు పెట్టిన వారు ఒకసారి అడుగుపెడితే కష్టం అయిన నష్టం అయినాగానీ భరించి తీరాలిసిందే. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాగాని వాళ్ళ జీవితంలో జరిగిన చేదు అనుభవాలను బయటకు చెప్పుకోలేక సతమత మవ్వాలిసిందే. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ గా నటించిన వాళ్ళు తరువాత ఎవరికో ఒకరికి అక్కగా, చెల్లెలిగా, తల్లిగా, వదినగా, నటించాలి కాబట్టి. హీరోయిన్లు ఇప్పుడు కొత్త కొత్తగా వస్తూనే ఉంటారు. కానీ హీరోలు మాత్రం అలానే ఎప్పటికి టాప్ పొజిషన్లో ఉండిపోతారు. కాబట్టి హీరోయిన్ల జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగిన బయట పెట్టరు. అప్పట్లో ఒక హీరోయిన్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఎందుకు ఆ హీరోయిన్ అర్దాంతరంగా టాప్ పొజిషన్ నుంచి చిన్న పాత్రలు చేయవలిసి వచ్చింది, ఇంకా కెరీర్ ఉండగానే పెళ్లి ఎందుకు చేసుకుందో తెలియదు. ఆ హీరోయిన్ అలా కనుమరుగు అవ్వడానికి కారణం ఏంటో తెలుసుకుందాం..

అప్పట్లో శ్రీదేవిని అందరూ అతిలోక సుందరి అని పిలుస్తుంటే, కొందరు దర్శక నిర్మాతలు మాత్రం సహజ సిద్ద అందమంటే జయప్రదదే అని కితాబు ఇచ్చేవారట. అలా అంతటి నాచురల్ అందాన్ని కలిగిన జయప్రద తరువాత ఆ బిరుదు అందుకున్న హీరోయిన్ రజిని ఒక్కటే. ఈమెకు శశికళ అనే మరొక పేరు కూడా ఉంది. ఈమె తెలుగుతో పాటు కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాలలో నటించింది. ఇక ఆమె తెలుగులో బాలకృష్ణ సరసన నటించిన సీతారామ కళ్యాణం సూపర్ హిట్ అయింది. అలాగే రెండు రెళ్ళ ఆరు, అహ నా పెళ్ళంట చిత్రాలలో రాజేంద్రప్రసాద్ సరసన కూడా నటించి అందరినీ మెప్పించింది. దాసరి దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన మజ్ను చిత్రంలో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది. అలాగే కన్నడలో విష్ణువర్ధన్ తో పాటు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తో పాటు కూడా నటించింది. ఈమె అసలు పేరు రజని పర్విర్. ఈమె బెంగళూరులో పంజాబీ తండ్రికి, కన్నడ తల్లికి జన్మించింది. 1983 నుంచి 1993 వరకు దాదాపు దశాబ్దం పాటు చిత్ర పరిశ్రమను ఏలిన నటి. సుమారుగా దాదాపు 150 చిత్రాల్లో నటించింది. తరువాత ఎన్నారై డాక్టర్ ప్రవీణ్ ముల్లగిరిని పెళ్లి చేసుకుంది.

ఇక ఆమె పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళి పోయి సెటల్ అయ్యారు. ఎన్నో సంవత్సరాల తరువాత తాజాగా ఈ మధ్యనే హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఇప్పటికీ తనకు అవకాశాలు వస్తే ఏ పాత్రలోనైనా చేస్తాను అని అంటుంది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మముడి చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. అలాగే అక్కినేని నాగార్జున, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన బ్రహ్మరుద్రులు చిత్రంలో వెంకటేష్ సరసన జోడిగా నటించింది. అలాగే వెంకటేష్ సరసన ద్రోణ సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. అర్జున్ తో బి.గోపాల్ మొదటి చిత్రం ప్రతిధ్వని, నాగార్జున అలాగే అక్కినేని కాంబినేషన్ లో వచ్చిన కలెక్టర్ గారి అబ్బాయి చిత్రంలో నటించింది. అగ్ని పుత్రులు, మురళి కృష్ణుడు, బాలకృష్ణ తో రాము, సాహస పుత్రుడు, కృష్ణ, శంఖారావం వంటి చిత్రాలలో నటించింది. ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటంటే తెలుగులో టాప్ రేంజ్ లో ఉన్న బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సరసన నటించినాగాని ఎటువంటి గొప్పలకు పోకుండా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి హీరోలతో నటించేది. రాజేంద్రప్రసాద్ తో కలిసి సినిమాలో నటించింది.

అయితే అప్పట్లో రాజేంద్రప్రసాద్ ప్రవర్తన కారణంగా ఆయనతో ఎవరూ కలిసి నటించడానికి హీరోయిన్లు ఒప్పుకునేవారు కాదు. దానితో అప్పట్లో రాజేంద్రప్రసాద్ హీరోయిన్ రజినిని మచ్చిక చేసుకుని తనతో ఎక్కువ సినిమాలు చేసేలాగా చేసుకున్నాడు. అయితే అప్పట్లో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని అందరు తప్పుగా అర్థం చేసుకుని వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అని తప్పుగా అర్థం చేసుకున్నారు. అలాగే కొన్ని కొన్ని పేపర్లలో అప్పట్లో ప్రకటనలు కూడా వచ్చాయి. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో వారిద్దరి మధ్య ఉన్న బంధం విషయంలో ఓ క్లారిటీ ఇచ్చారు రజని. మరి ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం అనేది లేదు, మా ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం తప్ప వేరే ఎటువంటి బంధం అనేది లేదు అని తెలిపారు. అప్పట్లో నేను టాప్ హీరోయిన్ గా ఉండేదాన్ని. చిన్న హీరోలతో సినిమా చేస్తానా, లేదా అనే అనుమానంతో రాజేంద్రప్రసాద్ నన్ను అడగడానికి భయపడ్డాడు. కానీ నాకు చిన్న పెద్ద అనే తేడా లేదు ఎవరితోనైనా నేను నటిస్తాను అని చెప్పాను. రాజేంద్రప్రసాద్ కి నేనన్నగాని, నా శరీరాకృతి అన్నగాని చాలా ఇష్టం. నేను తినే ఆహార పదార్థాల విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. నేను భోజనం చేస్తున్నప్పుడు నా పక్కనే ఉండి నేను ఎటువంటి ఆహార పదార్థాలు తింటున్నాను అని చూసేవాడు. నేను ఎందుకని ఇలా తెల్లగా, ఎర్రగా ఉన్నాను అని మా అమ్మని అడిగి నవ్వించేవాడు. ఇలా ఎర్రగా ఎలా ఉన్నావు, అసలు ఏమి తింటావు అని ఇలాంటి ప్రశ్నలు అడిగేవాడిని చెప్పారు.

ఆయనలో విలన్ మెంటాలిటీ కూడా ఉంది అదే సమయంలో నాతో సరదాగా కూడా ఉండే వాడు. నేను సినీ ఇండస్ట్రీలో ఎవరితో ఎక్కువగా మాట్లాడే దాన్ని కాదు. కానీ రాజేంద్రప్రసాద్ తో తప్పా ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడేదాన్ని కాదు అని ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ సినీ పరిశ్రమలో వారందరు ఆమెకు, రాజేంద్రప్రసాద్ కు ఎదో ఎఫైర్ ఉందని బలంగా నమ్మేవారట. ఇక టాప్ రేంజ్ లో ఉన్నప్పుడు ఆమె కెరియర్ పతనం కావడానికి, చిన్న చిన్న పాత్రలు తప్ప, పెద్ద పెద్ద హీరోలతో నటించడానికి, మరల మరల అవకాశాలు రాకపోవడానికి, కెరీర్ ఉండగానే వివాహం చేసుకోవడం వెనుక పెద్ద కథే ఉంది. ఆమె అప్పట్లో ఒక గొప్ప నటుడి వారసుడితో చాలా సినిమాలు చేసింది. అయితే ఆ హీరో రజినీనితో సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టపడేవాడట. ఇది గమనించిన ఆ హీరో తండ్రి ఆ హీరో కి వేరే అమ్మాయితో పెళ్లి చేసాడు. కానీ ఆ హీరో మాత్రం భార్య కు విడాకులు ఇచ్చి, రజినీని రెండో వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ హీరో తండ్రి స్వర్గీయ గ్రేట్ నటుడు కోపంతో రజినీకి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వంటే ఇష్టం లేదు, నీతో సినిమాలు చేయను అని చెప్పమని వార్నింగ్ ఇచ్చాడు. కానీ నేను చెప్పను అని కాకుండా నీ అంతటా నువ్వే చెప్పమని వార్నింగ్ ఇచ్చాడట. దీనితో భయపడిపోయి రజిని పెళ్లి చేసుకుని, నటనకు గుడ్ బై చెప్పి అమెరికా వెళ్లిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here