ఏ రంగంలోనైనా తమ తదననంతరం తమ వారసులుగా కొడుకులను తీసుకరావడం జరుగుతూ ఉంటుంది. అందుకు సినిమా రంగానికి ఎలాంటి మినహాయింపు ఉండదు.

నాటి నుంచి నేటి వరకు ఈ వారసత్వ పరంపర కొనసాగుతూనే ఉంది. కొడుకులను సినీ పరిశ్రమకు పరిచయం చేయడంతో పాటు, వారి చిత్రాలలో నటించిన ఆనాటి స్టార్ హీరోలు ఎంతో మంది ఉన్నారు.

1980లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రౌడీ రాముడు కొంటె కృష్ణుడు చిత్రంలో ఎన్టీరామారావు, బాలకృష్ణ కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలువగా, 1983లో యోగానంద్ దర్శకత్వంలో వచ్చిన సింహం నవ్వింది చిత్రంలో తిరిగి ఎన్టీరామారావు, బాలకృష్ణ, ప్రభ, కళారంజని హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని పొందింది.

అక్కినేని నాగేశ్వరరావు తన కొడుకు నాగార్జునను 1986లో తెలుగు తెరకు పరిచయం చేసాడు. 1987లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ.ఎన్.ఆర్, నాగార్జున కలిసి అగ్నిపుత్రుడు సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. ఆ తర్వాత 1990లో తిరిగి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఇద్దరూ ఇద్దరే చిత్రంలో నాగేశ్వరరావు, నాగార్జున, రమ్యకృష్ణ హీరో, హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో బాల నటుడిగా ఎంటరైన రమేష్ బాబు ఆ తర్వాత ఆయన చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా నటించడం జరిగింది. అలా 1990లో మురళీ మోహన్ రావు దర్శకత్వంలో వచ్చిన ఆయుధం చిత్రంలో కృష్ణ, రమేష్ బాబు, రాధా, వాణి విశ్వనాథ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.కృష్ణ స్వీయ దర్శకత్వంలో కృష్ణ, రమేష్ బాబు, మీనా హీరోహీరోయిన్లుగా కలియుగ కర్ణుడు సినిమాల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయాన్ని మూటగట్టుకుంది.

రెబల్ స్టార్ కృష్ణంరాజు తన తమ్ముడు సూర్యనారాయణరాజు కొడుకైనా ప్రభాస్ తో రెబల్ అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అపజయాన్ని చవిచూసింది.

2015లో శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బ్రూస్ లీ ఈ చిత్రంలో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇందులో చిరంజీవి ఒక ఫైట్ లో కనిపించారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అపజయాన్ని పొందింది.

2006లో మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో, రామ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చిత్రంలో మోహన్ బాబు, విష్ణు, పార్వతిమెల్టన్ కలిసి నటించారు. ఈ సినిమా ఒక డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత 2014లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో శ్రీవాసు దర్శకత్వంలో పాండవులు పాండవులు తుమ్మెద అనే చిత్రం విడుదల అయ్యింది. మోహన్ బాబు తన ఇద్దరు కొడుకులయిన విష్ణు, మనోజ్ లతో కలిసి ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మొత్తానికి తండ్రులు, కొడుకుల సినిమాల్లో నటిస్తే అందులో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. మరికొన్ని విజయాలు కూడా ఉన్నాయిలెండి.. కాని అలా విజయం సాధించిన సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here