తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన రజిత తొమ్మిదవ తరగతి పూర్తి చేసి వేసవి సెలవుల కోసం తన పిన్ని గారైన కృష్ణవేణి చెన్నైలో ఉండడంతో అక్కడికి వెళ్లి ఆమేతో పాటుగా షూటింగ్ లకు హాజరవుతూ ఉండేది. ఆ క్రమంలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్ని పుత్రుడు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రచయితలు పరుచూరి బ్రదర్స్ నటి రజితను చూసి దర్శకుడు కె.రాఘవేంద్రరావు కి పరిచయం చేయించారు. అలా అగ్ని పుత్రుడు సినిమా లో మొదటగా నటి రజిత అక్కినేని నాగేశ్వరరావు కూతురుగా నటించారు. తిరిగి కాకినాడ వచ్చి తన పదవ తరగతి విద్యాభ్యాసం పూర్తిచేశారు. తర్వాత ఉన్నత చదువుల కోసం చెన్నై వెళ్లి ఇంటర్మీడియట్ చదువుకుంటూ సన్నిహితుల సలహా మేరకు సినిమాల్లో నటిస్తూ ఉండేది.


1980 దశకం నాటి హీరోలలో ఒక సీనియర్ ఎన్టీఆర్ మినహాయించి మిగతా అందరి హీరోల తో రజిత నటించారు. తన చిన్నమ్మ లు కృష్ణవేణి, రాగిని సినీపరిశ్రమలో ఉన్నప్పటికీ సినిమా రంగంపై అంతగా ఇష్టం లేకపోయినా 1996 వరకు దాదాపు వంద సినిమాలలో నటించారు. ఇక ఆ తర్వాత సినిమానే తన సర్వస్వం అని సినిమా కెరీర్ ని సీరియస్ గా తీసుకుని ఇప్పుడు అనేక తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. 1998లో వచ్చిన పెళ్ళికానుక సినిమాకు గాను నటి రజిత కు ఉత్తమ హాస్యనటిగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారం అందుకుంది. తెలుగు తమిళం మలయాళం కన్నడ ఒరియా
లాంటి భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు.

తన కుటుంబం లోని ఇద్దరు అక్కలకు పెళ్లి జరిగింది. కానీ రజిత పెళ్లి చేసుకోకుండా తన తల్లి గారికి తోడుగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే అక్క పిల్లలను విదేశాలకు పంపి ఉన్నత చదువులను చదివిస్తున్నారు. తన కుటుంబానికి వెన్నెముకలా ఒక ఆదర్శవంతురాలిగా నిలిచారు. అయితే ఇలా తన కుటుంబం.. సినిమా రెండింటికి సమ ప్రాధాన్యతను ఇస్తున్న క్రమంలో.. ఒక ఈవెంట్ విషయంలో యు ఎస్ ఏ వెళ్ళారు. అక్కడ ఒక ఎన్నారై నటి రజిత ని చూసి నేను సినిమా నటీనటుల్లో మిమ్మల్ని మొదటిసారిగా చూశానని సినిమాలో నటించడం ఒక అదృష్టమని మీ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పడంతో రజిత తిరస్కరించారు. అయినా అభిమాని రిక్వెస్ట్ చేయడంతో చేసేదిలేక ఒప్పుకోవడంతో ఆశీర్వాదం అని చెప్పి రజిత కాలు తీసుకొని తన తలపై పెట్టుకోవడం జరిగింది. ఇది చూసిన నటి రజిత ఒక్కసారి అవాక్కయింది. అభిమానులు అంటే ఇలా కూడా ఉంటారా అని లోలోపల అనుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here