అనిల్ రావిపూడి ఏ సినిమా ఇన్స్పిరేషన్ తో రాజాదిగ్రేట్ సినిమా తీశాడో మీకు తెలుసా.?!

0
445

ఇట్స్ లాఫింగ్ టైం..ఉహుహుహూ..!! బుజ్జి నా ముఖ చిత్రం ఎలా ఉందిరా…. సంతోషానికి, సంభ్రమాశ్చర్యానికి మధ్య వెలిగిపోతుంది, కురుక్షేత్రంలో కోహ్లీ ఎన్ని రన్స్ కొట్టాడు.. అంటూ అన్నపూర్ణమ్మ గారు డైలాగ్ చెప్పడం. ఇవన్నీ తమాషా సంభాషణలు అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన తన చెల్లెళ్ళ తో గున్నా.. గున్నా.. మామిడి అనే పాట పోసాని కృష్ణ మురళి అతని తమ్ముల్లను ఆట పట్టించే పాట ప్రేక్షకులను మరింత నవ్విస్తుంది.

అనిల్ రావిపూడి తాను చదువుకుంటున్న సమయంలోనే సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉండేవాడు. అనిల్ రావిపూడి తన తల్లిదండ్రులు పని మీద వెళుతూ ఆయనను ఒక సినిమా థియేటర్ ప్రొజెక్టర్ రూమ్ లో వదిలి వెళ్లేవారు. ఆ క్రమంలో అదే థియేటర్ లో తరచూ సినిమాలు చూస్తూ, బడిలో చదువుకుంటూ తన బాల్యాన్ని గడిపాడు. కానీ ఎప్పుడూ తన చదువును నిర్లక్ష్యం చేయలేదు. అలా 2004లో బీటెక్ పూర్తి చేసిన అనిల్ రావిపూడి “తమ్ముడు” చిత్ర దర్శకుడైన అరుణ్ ప్రసాద్ దగ్గరి బంధువు కావడంతో ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరడం జరిగింది. ఆ తర్వాత శంఖం, శౌర్యం, దరువు సినిమాకి సంభాషణలు రాస్తూ సినిమాలపై మరింత అవగాహన పెంచుకోవడం జరిగింది. అలా 2015లో నిర్మాత దిల్ రాజ్ అవకాశం ఇవ్వడంతో కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ అనే చిత్రంతో అనిల్ దర్శకుడిగా మారాడు.

ఆ తర్వాత మళ్లీ శ్రీ వెంకటేశ్వర బ్యానర్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీం సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత మళ్లీ దిల్రాజు నిర్మాణ సారథ్యంలో రవితేజ హీరోగా రాజా ది గ్రేట్ చిత్రాన్ని నిర్మించాడు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే అనిల్ రావిపూడి ఈ కథను ముందుగా హీరో రామ్ ఆ తర్వాత తారక్ ఇద్దరికీ కథ చెప్పిన వారికి నచ్చకపోవడంతో తిరిగి అదే కథను మాస్ మహారాజా రవితేజ చెప్పడం జరిగింది. ఆయన చేస్తాననడంతో ఈ సినిమాను రవితేజ తో ప్రారంభించడం జరిగింది.

ఈ సినిమాలో రవితేజ తల్లిగా ముందుగా విజయశాంతిని అనుకోగా ఆమె నటించనని అనడంతో ఆ పాత్ర రాధికకు వెళ్ళింది. రవితేజ జోడిగా మెహరీన్ నటించింది. అయితే సింగీతం శ్రీనివాసరావు శారీరక వైకల్యం గల కథతో విచిత్ర సోదరులు సినిమా తీసి విజయం సాధించాడు. ఆ సినిమా నుంచి ప్రేరణ పొందిన అనిల్ రావిపూడి ఒక బ్లైండ్ కథను రాసుకుని 2017లో రాజా ది గ్రేట్ అనే సినిమాను తీసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ చేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here