ఓ కీబోర్డు ప్లేయర్ మణిరత్నం సినిమాకి మ్యూజిక్ డైరెక్టరా ఇక సినిమా ఆడినట్టే అన్నారు.!! కట్ చేస్తే…

0
1311

ఈ సృజనాత్మక దర్శకుడు తెలియని తమిళ తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో అనిపిస్తుంది. విభిన్నమైన కథాంశంతో తన సృజనాత్మకత తో సినిమాను మరో స్థాయిలో చూపించే దర్శకుడు మణిరత్నం. ఇక ఇళయరాజా గురించి చెప్పాలి అంటే ఏ సినిమా గురించి ప్రస్తావిస్తే ఆయన నైపుణ్యం కనిపిస్తుందో తెలియదు ఎందుకంటే ఆయన చేసిన సినిమాలన్నీ అద్భుత కళాఖండాలుగా చెప్పుకోవచ్చు. ఆయన స్వరపరచిన గీతాలు దక్షిణాది ప్రేక్షకుడి గుండెలను తాకిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

అయితే వీరిద్దరి కాంబినేషన్లో కమల్ హాసన్ నటించిన నాయకుడు, నాగార్జున నటించిన గీతాంజలి, మాస్టర్ తరుణ్ బేబీ షామిలి నటించిన అంజలి, రజనీకాంత్ మమ్ముట్టి నటించిన దళపతి వంటి చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. ఈ అద్భుతమైన విజయాల వెనుక ఇళయరాజా, మణిరత్నంల సాధారణమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి. సాధారణంగా ఇళయరాజా కథ వినగానే తన మనసులో ఊహించుకుని పాటలకు బాణీలు కట్టడం, బి.జి.ఎమ్ సమకూర్చడం వంటివి చేస్తుండేవారు. కొత్త లో మణిరత్నం ఆ విషయంలో జోక్యం చేసుకునే వారు కాదు కానీ వీరిద్దరి కాంబినేషన్లో 5 చిత్రాలు వచ్చేసరికి మణిరత్నం బాణీలు, RR విషయంలో జోక్యం చేసు కోవడం ప్రారంభించారు. ఇది ఇళయరాజాకు నచ్చేది కాదు అలా అభిప్రాయభేదాలు దళపతి వరకు కొనసాగి తర్వాత సినిమాకి కొత్త సంగీత దర్శకునితో తీయాలనే వరకు వచ్చింది. త్రిలోక్ తో పరిచయము ఉన్న మణిరత్నం ఆయన సలహా మేరకు కొత్త కుర్రాడు మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రయత్నిస్తున్నాడని ఏ.ఆర్.రెహమాన్ వద్దకు వెళ్లారు. ఆయన చేసిన కొన్ని క్యాసెట్లను తీసుకెళ్లి మణిరత్నం విన్నారు. దాదాపు రెండు నెలల తర్వాత దొంగ దొంగ కథ చెప్పారు.

అయితే బాలచందర్ ఆ సినిమా తర్వాత తీద్దామని అనడంతో మణిరత్నం రోజా అనే సినిమా కథని మళ్లీ ఏ.ఆర్.రెహమాన్ కి చెప్పారు. అలా ఏ.ఆర్.రెహమాన్ రోజా సినిమాకి మొదటి పాటకి ట్యూన్ కట్టారు. ఆ ట్యూన్ కి పాట రాయడానికి తమిళంలో ఫేమస్ రైటర్ వైరముత్తు ని పిలిపించారు. అక్కడ ఏ.ఆర్.రెహమాన్ చూసిన వైరముత్తు ఆశ్చర్యపోతూ ఇంతకుముందు ఓ మామూలు కీబోర్డ్ ప్లేయర్ ఎంతో పేరున్న మణిరత్నం సినిమాకి సంగీత దర్శకుడా ఇక సినిమా ఆడినట్టే అని తన మనసులో అనుకున్నారట. అలా రోజా సినిమాకి మొదటి పాట గా “చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ.. అనే పాటను వైరముత్తు రాశారు. 1992 సినిమా విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏ.ఆర్.రెహమాన్ కి ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డు కూడా వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here