భాగ్యచక్రం సినిమా షూటింగ్ జరుగుతోంది అక్కడ హీరోతో ఒక కమెడియన్ చీకటి ఉంది భయమేస్తుంది.. అనే సంభాషణ పలకాలి అలా కాకుండా కేవలం ఎక్స్ ప్రెషన్ తో ఆ సీన్ తీద్దామని మాటల రచయిత పింగళితో చెప్పగా అక్కడే ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు విన్నారు. నిజంగా మాటలు లేకుండా ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది. అనే ఆలోచన అక్కడే పుట్టింది. అలా దాదాపు కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత సింగీతం శ్రీనివాసరావు ఒక కథ రాసుకున్నారు.

ఒక పేద నిరుద్యోగి అకస్మాత్తుగా కోటీశ్వరుడు అవుతాడు అనే కథ బాగా రావడంతో అప్పుడు సింగీతం శ్రీనివాసరావు కమల్ హాసన్ తో చెప్పగా.. అప్పుడు కమల్ హాసన్ ఈ సినిమాను తప్పకుండా చేద్దామని అంగీకరించాడు. ఇక హీరోయిన్ ఎవరు అనే సందర్భంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ముంబై వెళ్లి నీలం కొటారిని కలిశారు. ఆమె ఆ సినిమా చేయడానికి కొన్ని షరతులు విధించింది. ఆ తర్వాత మరొక బాలివుడ్ సినీ ప్రముఖుడు మాధురి దీక్షిత్ పేరు చెప్పగానే ఆమెను కలిశారు. మాటలు లేని సినిమా మేము చేయమని ఆమె చెప్పడంతో సింగీతం శ్రీనివాసరావు వెనుతిరిగారు. ఆ తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ వారు తనకు సన్మానం చేస్తున్న కార్యక్రమానికి అమల యాంకర్ గా వచ్చింది. అక్కడ సింగీతం శ్రీనివాసరావు అమలను చూసి తను తీయబోయే పుష్పక విమానం చిత్రానికి ఆమె బాగా ఉంటుందని అనుకున్నారు. కానీ చాలా మంది సినీ ప్రముఖులు ఆమె ఇండస్ట్రీకి కొత్త నటన సరిగ్గా రాదు అని చెప్పారు.

అయిన కూడా వారి మాటలు లెక్కచేయకుండా ఆ సినిమాకి అమల నే హీరోయిన్ గా ఎంపిక చేశారు. విలన్ గా అమ్రిష్ పురిని అనుకున్నప్పటికీ చివరికి టిను ఆనంద్ ను ఎంపిక చేశారు. బెంగళూరులో ఒక విమానానికి పుష్పక్ అనే పేరు ఉండటంతో పుష్పక్ అనే పదం సింగీతం శ్రీనివాసరావు నచ్చి తన సినిమాకి పుష్పక విమానం అని పేరు పెట్టడం జరిగింది. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత సెన్సార్ కు వెళ్ళిన పుష్పకవిమానం. అక్కడ సెన్సార్ వాళ్ళు మాటలు లేని సినిమాకి సెన్సార్ చేయమని చెప్పారు. అప్పుడు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఆ సినిమాలో సందర్భానుసారంగా రేడియోలో ఒక పాటను సెట్ చేశారు. అలా సెన్సార్ పొందిన పుష్పక విమానం 1987 లో విడుదలై సినీ ప్రముఖుల అభినందనలను పొందింది. టాకీ చిత్రాలు వచ్చిన తర్వాత మూకీ గా వచ్చిన పుష్పక విమానం ఇతర భాషల్లోకి పుష్పక్ అనే టైటిల్ తో విడుదల కావడం జరిగింది.
































