ప్రతిధ్వని చిత్రంలో శారదను కాకుండా జయసుధను ఎంపిక చేయుమని రాఘవేంద్ర రావు ఎందుకన్నారో మీకు తెలుసా.?!

0
276

1985 లో వైజయంతి మూవీస్ నిర్మాణంలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ విజయశాంతి హీరో హీరోయిన్లుగా అగ్నిపర్వతం షూటింగ్ ఊటీలో జరుగుతుంది. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా బి.గోపాల్ పని చేస్తున్నాడు. అయితే ఒక రోజు షూటింగ్ విరామంలో పరుచూరి బ్రదర్స్ రూమ్ కు వెళ్లి అగ్నిపర్వతం సినిమా లోని డైలాగులు బాగా వచ్చాయని పరుచూరి గోపాలకృష్ణ తో బి.గోపాల్ చెప్పారు. అప్పుడే గోపాలకృష్ణ కి బెజవాడ గోపాల్ కి మధ్య పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత ఒకరోజు శారద కలిసి నా దగ్గర ఒక స్టొరీ లైన్ ఉంది అది చెప్తాను దాని మీద ఒక కథ రాయగలరా.. అని పరుచూరి గోపాలకృష్ణ తో శారద అన్నారు. అదేంటో చెప్పమని గోపాలకృష్ణ అడగగా ఒక పోలీసు ఆఫీసర్ డ్యూటీలో ఉన్న భార్య.. చట్టాన్ని ఉపక్రమించినప్పుడు భర్తపై చేయి చేసుకుంటుంది. అని ఊర్వశి శారద ఒక స్టోరీ లైన్ చెప్పారు. అప్పుడు పరుచూరి బ్రదర్స్ స్పందించి దానిపై ఒక కథ రాసుకోవడం జరిగింది. మరొకసారి పరుచూరి గోపాలకృష్ణ దగ్గరికి వెళ్లి మీ అన్నయ్య వెంకటేశ్వరరావు నన్ను పంపించారు. మీ దగ్గర శారద పోలీస్ ఆఫీసర్ గా కథ ఒకటి ఉందని చెప్పారని గోపాలకృష్ణ తో బి.గోపాల్ అన్నారు. ఈ కథతో నేనే ఒక సినిమా తీస్తాను అని చెప్పడంతో అక్కడి నుంచి బి.గోపాల్ వెళ్లిపోయారు. తిరిగి ఊర్వశి శారద మళ్లీ ఫోన్ చేసి మీరు తలుచుకుంటే రోజుకో కథ రాసుకో గల మేధావి, కావున ఆ కథని బి.గోపాల్ కి ఇవ్వండి. మీరు మరొక కథ రాసుకుని ఆ సినిమాకి దర్శకత్వం చేయండని శారద అనడంతో పరుచూరి గోపాలకృష్ణ ఆ కథని బి గోపాల్ కి ఇచ్చారు.

ఆ తర్వాత బి.గోపాల్, పరుచూరి గోపాలకృష్ణ కలిసి డి రామానాయుడు దగ్గరకు వెళ్ళి శారద లీడ్ రోల్ లో ఉన్న ఈ కథ చెప్పారు. అది బాగా నచ్చింది. తిరిగి పరుచూరి వెంకటేశ్వరరావు అదే కథను అర్జున్ లీడ్ రోల్ లో మరొకసారి డి.రామానాయుడు కి వినిపించారు. పరుచూరి బ్రదర్స్ తనదంటే తనస్టొరీ బాగుందని ఇద్దరూ వాదించారు. ఈ కథ విషయంలో కె.రాఘవేంద్రరావుతో చర్చించగా శారద, అర్జున్ కాకుండా జయసుధ, బాలకృష్ణ తో ఈ సినిమా తీస్తే బాగుంటుందని రాఘవేంద్ర రావు అన్నారు. మీకు వీలైతే ఆ కథని తనకిమ్మని కె.రాఘవేంద్రరావు పరుచూరి బ్రదర్స్ ని అడిగారు. అప్పుడు పరుచూరి బ్రదర్స్ బి.గోపాల్ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు. కావున ఈ కథ ఆయన సినీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనడంతో కె.రాఘవేంద్రరావు పోలీస్ పాత్రలో శారద కాకుండా జయసుధ బాగుంటుందని చెప్పి వెళ్లిపోయారు. తరువాత ఊర్వశి శారద లీడ్ రోల్ లో ప్రతిధ్వని సినిమా 1986 లో విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here