తెలుగు ప్రజల గుండెల్లో తాను ఎప్పటికీ ఆంధ్ర సోగ్గాడు గానే ఉండాలని హీరో గా ఉన్నప్పుడే తాను స్వచ్ఛందంగా సినిమాల నుంచి తప్పుకోవడం జరిగింది. హేర్ రింగ్ స్టైల్ అని మరిచిపోయి, శోభన్ బాబు రింగ్ అనేంతగా పేరు తెచ్చుకోవడం జరిగింది.

కాలేజీలో చదువుతున్నప్పుడే శోభన్ బాబు సీనియర్ నటులు అయిన ఏ.ఎన్.ఆర్, ఎన్టీఆర్ సినిమాలు క్రమం తప్పకుండా చూసేవాడు. విజయవాడలో లో డిగ్రీ చదువుతున్నప్పుడే పునర్జన్మ అనే నాటకం వేశారు. నాగేశ్వరావు నటించిన కీలుగుర్రం అనే సినిమా శోభన్ బాబు చూసిన మొదటి చిత్రంగా పేర్కొనవచ్చు. మల్లీశ్వరి సినిమా నచ్చడంతో ఆ సినిమాను 22 సార్లు చూశారు. మద్రాసులో లా కోర్సులో చదువుతూ ఉదయం కాలేజీకి వెళుతూ మధ్యాహ్నం సినిమా అవకాశం కోసం ప్రయత్నం చేసేవాడు.
అలా సినిమా ప్రయత్నంలో ఉండగానే 1958లో వివాహం చేసుకున్నాడు.

తర్వాత 1959లో ఎన్టీ రామారావుతో దైవ బలం అనే సినిమాలో మొదటగా నటించాడు. ఆ తర్వాత భక్త శబరి, భీష్మ, అభిమన్యు, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న, మనుషులు మారాలి, సంపూర్ణ రామాయణం, కురుక్షేత్రం, డాక్టర్ బాబు, సోగ్గాడు, గోరింటాకు, శ్రావణ సంధ్య, దేవత, కార్తీకదీపం, ముందడుగు, మహాసంగ్రామం స్వయంవరం, సంపూర్ణ ప్రేమాయణం, సంసారం, సర్పయాగం లాంటి చిత్రాల్లో శోభన్ బాబు నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు.

కోడెత్రాచు, ఇల్లాలు ప్రియురాలు, వంటి చిత్రాలతో కోదండరామిరెడ్డి శోభన్ బాబు తో స్నేహాన్ని పెంచుకున్నారు. హైదరాబాదు నుండి మద్రాస్ వెళ్ళినప్పుడు శోభన్ బాబు పిలుపు మేరకు.. కోదండరామిరెడ్డి ఆయన దగ్గరికి వెళ్లారు. ఏంటి సినిమాలు చేయట్లేదు అని కోదండరామిరెడ్డి అడగగానే… ఆ అందాల నటుడు శోభన్ బాబు ఎప్పుడో చనిపోయాడు. జుట్టు ఊడిపోయి ముడతలు పడిన శరీరంతో ఇప్పుడు చేస్తే, శోభన్ బాబు ఇంతేనా ఏదో మేకప్ తో కవర్ చేశారని అనుకుంటారు. నేనింతే ఇంట్లోనే ఉంటాను. నా ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఇక నేను సినిమాల్లో నటించను, ఎంతో దూరం నుంచి నా దగ్గరకు రాకండి అని చెప్పానంటూ కోదండరామిరెడ్డి తో తన మనసులో మాట అందాల నటుడు శోభన్ బాబు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here