ప్రకాశం జిల్లా కారంచేడు లో జన్మించిన ఈయన పెరిగి పెద్దయ్యాక వ్యాపారాలపై ఎక్కువ మక్కువ చూపడం జరిగింది. వ్యవసాయం, రైస్ మిల్స్, బస్ ట్రాన్స్ పోర్ట్ లాంటి వ్యాపారాలు చేస్తూ ఉండగా…ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా ‘నమ్మినబంటు’ సినిమా షూటింగ్ తమ సొంత ఊరు కారంచెడు లోనే జరుగుతుండగా డి.రామానాయుడు అక్కడికి వెళ్లారు. ఆ చిత్రాన్ని తమ ఊరివారు పైగా తమ బంధువులే నిర్మిస్తున్నారని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కొన్ని వ్యాపారాలు కొనసాగిస్తున్నప్పటికీ ఎందుకో సినిమాలో కొంత పెట్టుబడి పెట్టాలనుకున్నారు. అలా ‘నమ్మినబంటు’ చిత్ర నిర్మాతలను కలిసి తన కోరికను చెప్పడం జరిగింది. అప్పుడు రామానాయుడుది చిన్న వయసు కావున తక్కువ వాటాతో సినిమాల్లో పెట్టుబడి పెట్టమని సలహా ఇవ్వడం జరిగింది. అలా ‘నమ్మినబంటు’ చిత్రానికి రామానాయుడు కొంత పెట్టుబడి పెట్టారు.

ఆ క్రమంలో చిత్ర నిర్మాణానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం నటీనటులకు సంబంధించిన భోజన ఇత్యాది కార్యక్రమాలను చూడటం లాంటివి చేయడం జరిగింది. పైగా షూటింగ్లో వాడిన ఎద్దులను కూడా రామానాయుడు తన సొంతవే కావడం జరిగింది. ఆ తర్వాత రైస్ మిల్స్ పై ఇన్కమ్ టాక్స్ వారు రైడ్ చేయడం, రామానాయుడు కి నోటీసులు ఇవ్వడం లాంటివి జరిగాయి. వ్యవసాయం 100 ఎకరాలు ఉన్నప్పటికీ వాటిని ఎంత సాగుచేసిన పెద్దగా లాభాలు వచ్చేవి కావు. ఎవరో సలహా మేరకు తన పెదనాన్న మద్రాసులో ఉండడం వలన అక్కడికి వెళ్లి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నాడు.ఆ క్రమంలో మద్రాసు ప్రయాణమై ‘అనురాగం’ అనే సినిమాలో 50వేల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది. కానీ ఆ సినిమా పరాజయం చెందింది. తిరిగి కొత్త సినిమా ప్రారంభిద్దాం అంటే ‘అనురాగం’ చిత్ర నిర్మాతలు ఎవరు కూడా ముందుకు రాలేదు.

ఆ క్రమంలో తన బంధువుల సహకారంతో 1963 లో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి తాపీ చాణక్య దర్శకత్వం లో ఎన్టీ రామారావు, జమున, విజయలక్ష్మి హీరోహీరోయిన్లుగా ‘రాముడు భీముడు’ అనే చిత్రాన్ని 1964 మే 21న చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. సినిమా మొదటి రోజు నుండే హిట్ టాక్ రావడం జరిగింది. అలా తాను మొదటి సినిమాల్లో పెట్టుబడి పెట్టిన డబ్బులతో పాటు లాభాలు కూడా ‘రాముడు భీముడు’ అనే చిత్రం తీసుకు వచ్చింది. ఆ తర్వాత ప్రేమ్ నగర్, జీవనతరంగాలు, సోగ్గాడు, దేవత, అహ నా పెళ్ళంట హిందీలో మొదటగా దిల్ ఔర్ దీవర్, తోఫా, ప్రేమ్ నగర్ (హిందీ), తక్దీర్ వాలా… లాంటి హిందీ చిత్రాలే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతి, బెంగాలీ, ఒరియా, పంజాబీ, అస్సామీ, భోజ్ పురి లాంటి 13 భారతీయ భాషల్లో అనేక చిత్రాలను నిర్మించారు.

దాదాపు 130 చిత్రాలను నిర్మించినందుకు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. 2006లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, 2009లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2012లో మాజీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మభూషణ్ తీసుకోవడం జరిగింది. 2015 ఫిబ్రవరి 18న డి. రామానాయుడు క్యాన్సర్ వ్యాధితో తుది శ్వాస విడిచారు. ఇప్పటికీ ఆయన సాధించిన రికార్డును ఎవరు కూడా అధికమించలేదు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
































