భీమ్లా నాయక్ గాయకుడు కిన్నెర మొగిలయ్య ఎవరో తెలుసా? పవన్ కల్యాణ్ మర్చిపోలేని బహుమానం..!

0
486

భీమ్లా నాయక్.. పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ.. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. పవన్ బర్త్ డే రోజున రిలీజ్ అయిన ఈ పాట సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. పాట విడుదలై 24 గంటలు గడవక ముందే 10 మిలియన్లకు చేరువలోకి చేరాయి వ్యూస్. ఈ పాటకు ధమన్ అందించిన స్వరాలు, ఆ పాటకు సంబంధించిన విజువలైజేషన్ వారెవ్వా అనిపిస్తుంది. అటు ఈ పాటను పాడిని వాయిస్ జనాలను మెస్మరైజ్ చేస్తుంది. నిజానికి ఈ పాటను ఇద్దరు పాడారు. తొలుత ఈ పాటను మొదలు పెట్టింది కిన్నెర మెట్ల వాయిద్యకారుడు మొగిలయ్య.. ఇంతకీ ఆ మొగిలయ్య ఎవరో ఇప్పుడు తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు.

ఈ పాటను మొగిలయ్య మొదలు పెడితే మరో సింగర్ రామ్ పూర్తి చేశాడు. వీరిద్దరి కలయికతో ముందుకు సాగే ఈ పాట జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పవన్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తెచ్చింది. రామ్ గురించి కాకుండా మొగిలయ్య గురించి బాగా ఆరా తీస్తున్నారు సోషల్ మీడియా జనాలు. మొగిలయ్య పుట్టింది నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల ప్రాంతంలో జన్మించాడు. ఈయన ఏడు మెట్ల కిన్నెర వాయిద్య కారుడు. తన తాత తండ్రుల నుంచి ఆయనకు ఈ వాయిద్యం వారసత్వంగా వచ్చింది. ఆ ఏడు మెట్లను 12 మెట్లుగా అప్ డేట్ చేశాడు మొగిలయ్య. ఈ వాయిద్యంతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. ఎందిచేతనో ప్రశంసలు పొందాడు.

జానపద కళల్లో కిన్నెర మెట్ల వాయిద్య కళ కూడా ఒకటి. మొగిలయ్య ఈ కళను కాపాడేందుకు ఎంతో క్రుషి చేశాడు.. చేస్తున్నాడు. ఆయన కళను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఉగాది పురస్కారంతో సత్కరించింది. అంతేకాదు.. ఈయన గురించి 8వ తరగతి పాఠ్య పుస్తకంలో పాఠంగా చేర్చి.. ఆయనకు అద్భుత గౌరవం ఇచ్చింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఆయన గురించి తెలుసుకున్నాడు. ఆయనను పిలిపించుకుని తన సినిమాలో పాట పాడేలా చేశాడు. ఈ పాట కోసం మొగిలయ్యను చెన్నైకి పంపించారు. అక్కడే ఈ పాటను రికార్డు చేయించారు. ప్రస్తుతం మొగిలయ్య పేరు మార్మోగుతుంది.