Virat Kohli : ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఆర్సీబీ అభిమానుల కల నెరవేరింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ఆటగాళ్లు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో కంటతడి పెట్టుకున్నాడు. ఒకానొక సమయంలో తన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆర్సీబీకి ఇది చిరస్మరణీయమైన రోజు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆ తర్వాత 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ ఫైనల్ మ్యాచ్ అనేక మలుపులు తిరిగింది. ఒకసారి ఆర్సీబీ పైచేయి సాధిస్తే, మరోసారి పంజాబ్ పుంజుకుంది. అయితే, చివరికి విజయం మాత్రం ఆర్సీబీనే వరించింది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పంజాబ్‌ను కట్టడి చేశారు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫైనల్‌లో విఫలమయ్యాడు. కేవలం 1 పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. చివర్లో శశాంక్ హాఫ్ సెంచరీతో రాణించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ గెలుపు ఆర్సీబీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.



























