పూజా హెగ్డే వ్యక్తిగత జీవితం మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. కొంతకాలంగా సినిమాల విషయంలో నెమ్మదిగా అడుగులు వేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ గురించి, ఇప్పుడు కొత్తగా లవ్ స్టోరీ గాసిప్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ యువ నటుడు రోహన్ మెహ్రాతో ఆమె రిలేషన్‌లో ఉందన్న ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా పాకుతోంది.

తెలుగు సినీ పరిశ్రమలో ‘బుట్టబొమ్మ’గా గుర్తింపు పొందిన పూజా హెగ్డే, కెరీర్ ప్రారంభ దశలోనే వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోల సరసన నటించింది. అందం, నటన కలగలిపిన తన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొన్ని సంవత్సరాల పాటు వరుస హిట్లతో టాప్ రేంజ్‌లో కొనసాగిన ఆమె, తరువాత వచ్చిన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కొంత వెనుకబడింది.
ప్రస్తుతం సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న పూజా, కొత్త ప్రాజెక్టులతో తిరిగి బిజీ కావాలని చూస్తోంది. ఇదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గతంలో కూడా కొందరు ప్రముఖులతో ఆమె పేరును లింక్ చేస్తూ ప్రచారం జరిగినప్పటికీ, అవన్నీ కేవలం గాసిప్స్‌గానే మిగిలిపోయాయి.
ఇప్పుడు అయితే రోహన్ మెహ్రాతో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి పలు సందర్భాల్లో కనిపించడం, కలిసి బయటకు వెళ్లడం వంటి అంశాలు ఈ ప్రచారానికి బలం చేకూర్చాయి. సినిమా పరంగా కలిసి పని చేయకపోయినా, ఓ స్నేహితుడి ద్వారా పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని బీటౌన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ఈ విషయంపై పూజా హెగ్డే లేదా రోహన్ మెహ్రా ఎవరూ అధికారికంగా స్పందించలేదు. దీంతో ఇది నిజమా, కేవలం ప్రచారమా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అభిమానులు మాత్రం ఈ వార్తలపై ఆసక్తిగా గమనిస్తూ, నిజం ఏంటో తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇక పూజా త్వరలో తన వ్యక్తిగత జీవితం గురించి ఏదైనా క్లారిటీ ఇస్తుందా అనే విషయం చూడాలి.































