కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెల్సిందే.. తాజాగా కొన్ని సడలింపులిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతినిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో గత రెండు రోజులుగా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఇన్నాళ్లు మిస్ అయిన మద్యం కోసం మందుబాబులు ఎగబడిపోయారు. కొన్ని రాష్ట్రాలలో ధరలు విపరీతంగా పెంచినా ఏమాత్రం తగ్గడంలేదు మందుబాబులు. వీటికి సంబంధిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వీడియో కూడా ఒక వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రకుల్ చేతిలో ఒక బాటిల్ ఉంది. ఆ బాటిల్ చూసి ఆమె కూడా మద్యం కొనుక్కుని వస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే… ముంబై నగరం బాంద్రా లోని ఒక మెడికల్ షాపులో మందులు కొనుక్కొని రోడ్డు దాటుతుండగా ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోను కొందరు ఆకతాయిలు రకుల్ వైన్ షాపుకు వెళ్లి మద్యం కొనుగోలు చేసిందంటూ తప్పుడు ప్రచారం చేసారు. నిజానికి ఆమె కొనుగోలు చేసింది మెడికల్ షాపులోని మందులు ఆ విషయం క్రింది వీడియో చుస్తే తెలుస్తుంది.
Before writing something just cross check the proof
— The Bheeshma (@BheeshmaTalks) May 6, 2020
It's medicine not alcohol
Rakul Preet was buying medicines from her neighborhood medical store in Bandra in mumbai#RakulPreetSingh @Rakulpreet pic.twitter.com/JMAShpaLfM




























