Is KGF Real story : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సంచలనాలకు మారు పేరు.ఒక్కసారిగా కన్నడ చిత్ర పరిశ్రమ వైపు ఇండియా మొత్తం చూసింది. ఇక ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు యష్ . రాకీ భాయ్ గా ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించుకున్నాడు.పాన్ ఇండియా అసలు సినిమా కేజీఎఫ్. ఏమాత్రం ప్రచారం హడావిడి లేకుండా ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించుకున్న కేజీఎఫ్ కథ కర్ణాటక లోని కోలార్ గనుల్లో బంగారం మైనింగ్ నేపథ్యంలో ఆధిపత్యం కోసం జరిగే కథగా తెరకెక్కుతోంది.

చాలా మంది ఇప్పటి తరం వారికి కేజీఎఫ్ అంటే కేవలం సినిమాగానే తెలుసు కానీ అసలు చరిత్ర తెలీదు.పాత తరం వాళ్లకు కోలార్ గనుల గురించి అంతో ఇంతో తెలుసు. అయితే కేజీఎఫ్ సినిమాలో లాగా అక్కడ నిజంగా అన్నీ అరాచకాలు అధిపత్య పోరు జరిగాయా అనే ఆలోచన మొదలయింది చాలా మందికి.

కోలార్ గనుల్లో బంగారం నిజమే…..
కోలార్ నగరానికి 30 కి.మీ, బెంగళూరుకు 100 కి.మీ దూరంలో ఉన్నాయి. సుమారు 100 ఏళ్ల పాటు ఆ ప్రాంతంలో బంగారం తవ్వకాలు జరిగినట్లు చరిత్ర మాట. 2001 నుండి ఇక్కడ తవ్వకాలు నిలిపేశారు. టిప్పు సుల్తాన్ బ్రిటిషర్స్ తో యుద్ధంలో ఓడిపోయి మరణించాక బ్రిటిషర్స్ చేతిలోకి మైసూర్ సంస్థానం వెళ్ళిపోయింది.బ్రిటిష్ గవర్నర్ జాన్ వారెన్, కోలార్ ప్రాంతం మట్టిలో బంగారం ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన ఓ పుసక్తంలో రాసుకొచ్చారు. అక్కడ బంగారాన్ని వెలికి తీయాలని ఆ పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తుల సాయంతో మట్టి తవ్వకాలు చేపట్టాడు.

అయితే అతి తక్కువ మొత్తంలో అక్కడ బంగారం ఉందని, ఇది ఒక వృథా ప్రయత్నమేనని భావించి మధ్యలోనే తన ప్రయత్నం ఆపేశాడు. అయితే 1850 తర్వాత వారెన్ రాసిన పుస్తకాన్ని లావెల్లీ అనే బ్రిటిష్ అధికారి చదివి బంగారు తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించాడు. కొన్ని రోజులకు జాన్ టేలర్ కంపెనీ చొరవతో కోలార్‌లో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. తవ్వకాలకు అవసరమైన విద్యుత్ కోసం ఓ భారీ పవర్ ప్లాంట్‌ను కూడా అక్కడ నిర్మించారు.30,000 మంది కార్మికులు ఈ గనుల్లో పనిచేసేవారట. 2001 వరకు అక్కడ తవ్వకాలు జరిగాయి. ఇక అక్కడ బంగారం అంతరించిపోయిందని మైనింగ్ ఆపేసారు. కెజిఫ్ సినిమాలో చూపించినట్టు ఆధిపత్యపోరు, కార్మికుల చీకటి పోరాటాలు నిజంగా జరిగాయా అంటే లేదనే చెప్పాలి. కేవలం కల్పిత కథగా రూపొందిన ఈ చిత్రం రికార్డులు బద్దలు కొట్టి, ఇపుడు రెండో భాగం విడుదలకు సిద్ధమైంది.



























