Is their any sequel for KGF 2 : అసలైన మొదటి పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలయి సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం. ఇక ఈ సినిమాతో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఉత్తరాదిన బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ శాండల్ వుడ్ హీరో.ఇక రెండో సినిమాకే ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్ పేరు వినపడేలా ఈ సినిమా మార్చేసింది. ఇక ఎపుడు కేజీఎఫ్ 2 విడుదలవడంతో మరోసారి చరిత్ర సృష్టించడానికి సిద్ధామవుతోంది.

కేజీఎఫ్ 3 ఉండబోతోందా….
ఈ సినిమాకు క్రేజ్ ఎలా ఉందంటే మొదటి రోజు ఈ సినిమాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 లక్షలకు పైగా టిక్కెట్లు బుక్ అయ్యేంతగా .ఇక గురువారం విడుదలయి ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.ఇక రివ్యూలలోనూ పాజిటివ్ టాక్ రావడంతో సినిమా ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తోంది. ఇక సినిమా కు వేరే ఆ సినిమా పోటీగా లేకపోవడం మరో ప్లస్ పాయింట్.ఇక ప్రీమియర్ షో తర్వాత బయటికి వచ్చిన లీక్ కేజీఎఫ్ 3 ఉండబోతోంది అని ప్రచారం జరిగింది.KGF చాప్టర్ 2 ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ 3పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. కేజీఎఫ్ 3 కూడా రానుందా?అని విలేకరి అడిగిన ప్రశ్నకు, ఏమో చూడాలి ఛాప్టర్ 2 చూస్తే మీకే అర్థమవుతుంది అంటూ బదులిచ్చారు. ఈ కామెంట్ తోనే కేజీఎఫ్ ఛాప్టర్ 3 కూడా రానున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. ఇక నెట్టింట్లో కేజీఎఫ్ 3 కి సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్ ఫోటో వైరల్ గా మారింది ఇది ఈ ఊహగానాలకు మరింత బలాన్నిస్తోంది.



























