Ramcharan -Upasana:టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మెగా వారసుడిగా అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ గురించి అందరికీ తెలిసిందే.ఇక ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇకపోతే రామ్ చరణ్ అపోలో హాస్పిటల్ ఫౌండర్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కామినేని అనే అమ్మాయిని ఐదు సంవత్సరాలపాటు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం 2011 జూన్ 14వ తేదీ దేశం మొత్తం మాట్లాడుకునేలా ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. ఇక వీరి వివాహం తర్వాత రామ్ చరణ్ నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అగ్రహీరోగా పేరుపొందారు. అదేవిధంగా ఉపాసన అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టారు.ఈ విధంగా వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నటువంటి ఈ జంట తమ పదవ వివాహ వార్షికోత్సవాన్ని ఇటలీలో ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన పెళ్లి రోజుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే మెగా అభిమానులు సైతం ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు వీరికి పిల్లలు లేకపోవడమే మెగా అభిమానులను కాస్త నిరుత్సాహ పరుస్తుంది.
ఆ విషయంలో భయపెడుతున్న ఉపాసన..
రామ్ చరణ్ తో పాటు పెళ్లి చేసుకున్న హీరోలకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ ఈ జంట మాత్రం పిల్లల గురించి ప్లాన్ చేయకపోవడానికి కారణం ఏమిటి అంటూ ఆరా తీస్తున్నారు. ఇక వీరిద్దరు ఇప్పుడే పిల్లలు వద్దని కోవడానికి కూడా ఓ కారణం ఉందని తెలుస్తోంది.ఉపాసన ఇది వరకు ఎంతో శరీర బరువు ఉండేది ఇప్పుడిప్పుడే ఆమె తన శరీర బరువు తగ్గడమే కాకుండా తనకు గర్భం దాల్చాలంటే ఎన్నో భయాందోళనలు ఉన్నాయని, అయితే పిల్లలు గురించి సరైన సమయం వచ్చినప్పుడే ఆలోచిస్తామని తెలిపారు.ఇక రామ్ చరణ్ కూడా చిరంజీవి అభిమానులను సందడి చేసే విషయంలో కొన్ని గోల్స్ ఉన్నాయని పిల్లలు ఉంటే అతను తన లక్ష్యాన్ని చేరుకో లేనని పలు సందర్భాలలో వెల్లడించారు. ఇలా వీరికున్న గోల్స్ చేరుకున్న తర్వాత పిల్లల గురించి ఆలోచిస్తారని తెలుస్తోంది.






























