సినీనటుడు దగ్గుబాటి రానా తన గర్ల్ ఫ్రెండ్ మిహికా బజాజ్ ను పెళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే దీనికి సంబందించిన రోకా ఫంక్షన్ కూడా చేసుకున్నారు దానికి సంబంచిందిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే గతంలో హీరోయిన్ త్రిష తో డేటింగ్ చేసాడనే వార్త అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే త్రిష తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టు పెట్టింది. ఇప్పుడు ఆ పోస్టు కాస్తా వైరల్ అవుతుంది

అయితే రానాను ఉద్దేశించే త్రిష ఈ పోస్టు చేసిందంటున్నారు నెటిజన్స్.. వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ గురించి పెట్టిన ఆ పోస్ట్ వైరల్ కావడంతో వెంటనే డిలీట్ చేసిందని ప్రచారం జోరుగా జరుగుతోంది. త్రిష పెట్టిన పోస్ట్‌లో.. “నాకు తెలుసు. ఎవరైతే తమ మాజీ ప్రియురాళ్ళను స్నేహితులిగా కొనసాగిస్తారో వారు అహంకారులు అంటూ ఒక పరిశోధనలో తేలింది..” అంటూ పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్‌ని చూసిన నెటిజన్స్.. ఆమె ఖచ్చితంగా రానా గురించే చేసిందంటూ పెద్దఎత్తున కామెంట్స్ చేశారు.. దీనితో ఆమె వెంటనే ఆపోస్టును డిలీట్ చేసింది. కానీ అప్పటికే ఆమె చేసిన వ్యాఖ్యలను కొందరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు. గతంలో రానా, త్రిషలు డేటింగ్‌లో ఉండగా, ఏవో కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే రానా తన ప్రియురాలు మిహీకా బజాజ్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో త్రిష తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారిందని అంటున్నారు.




























