Is Varun Tej getting marriage With Lavanya Tripathi : మెగా ఫ్యామిలీ వారసుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. కంచె సినిమా తో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన వరుణ్ తేజ్ ఫిదా వంటి హిట్ సినిమాతో అభిమానులను సంపాదించుకున్నాడు. వరుణ్ తేజ్ కు ఇటీవల వచ్చిన గని సినిమా ఆశించిన విషయం ఇవ్వలేకపోయింది. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ ఒక టాలీవుడ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు అన్నట్టు రూమర్లు వస్తున్నాయి. మీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు ప్రేమ లో వున్నారా…?
చాలా రోజులుగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ బర్త్ డే కోసం లావణ్య త్రిపాఠి తో కలిసి బెంగళూరు వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నారని అక్కడ తనకి డైమండ్ రింగ్ కూడా గిఫ్ట్ ఇచ్చారన్న వార్తలు వచ్చాయి. ఐతే అప్పట్లో లావణ్య ఆ రూమర్లకు తెరదించింది. ఐతే లావణ్య వరుణ్ తేజ్ సోదరి అయిన నిహారిక పెళ్ళికి హాజరు అవ్వడం అక్కడ అందరితోనూ చాలా చనువుగా ఉండటం చూసి వీరిద్దరూ మధ్య ఎదో వుంది అని క్లారిటీకి వచ్చారు.
ఇప్పటికే లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి మిస్టర్ మరియు అంతరిక్షం అనే సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాలు అంత హిట్ అవ్వకపోయిన వీరి మధ్య ప్రేమ చిగురించింది అని వార్తలు వస్తున్నాయ్. ఇంట్లో కూడా వీళ్ల ప్రేమ గురించి చెప్పడం వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక పెళ్లి లాగానే నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి కూడా అంగరంగ వైభవంగా చేయబోతున్నారట. ఇది నిజమో కాదో తెలియదు కానీ చూడటానికి ముచ్చటగా ఉండే ఈ జంట ఒకటి అయితే బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు.



























