కరోనా లాక్‌డౌన్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ తొందరగానే సెటిల్ అయ్యింది అనే చెప్పాలి.. లాక్ డౌన్ తర్వాత జనాలు థియేటర్లకు వస్తారో లేదో అన్న అనుమానంతో ప్రభుత్వం థియేటర్లకు అనుమతి ఇచ్చింది.. అయితే ఎప్పటిలానే జనాలు రావడం.. దానికి తోడు.. కరోనా తర్వాత విడుదల చేసిన సినిమాలు దాదాపు చాలా వరకు విజయం సాధించడం జరిగింది.. ఇప్పటికీ మన టాలీవుడ్ కి వరస విజయాలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్న ప్రేక్షకులు ఎలాంటి భయాలు లేకుండా థియేటర్స్‌కు వస్తున్నారు.

ఈ యేడాది జనవరిలో ‘క్రాక్’ మూవీతో మొదలైన కలెక్షన్ల ప్రభంజనం.. ఫిబ్రవరిలో ‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగిసింది. ఆ తర్వాత మళ్లీ ‘జాతి రత్నాలు’ సినిమాతో థియేటర్స్ కళ కళ లాడుతున్నాయి.. స్వప్న సినిమా బ్యానర్ పై మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించాడు.. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పుడు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది… రెండు తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమా తన జోరును చూపిస్తోంది..

అయితే ఈ సినిమా కంటే ముందు విడుదలైన రవితేజ క్రాక్, వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలు సాధించలేని రికార్డును ‘జాతి రత్నాలు’ సినిమా సాధించింది. ఈ సినిమా తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది ఈ సినిమా.. కరోనా తర్వాత విడుదలైన ‘మాస్టర్’, క్రాక్’, ఉప్పెన’ సినిమాలేవి యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయలేకపోయాయి.కానీ అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన ‘జాతి రత్నాలు’ సినిమా మాత్రం యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ డాలర్ వసూళ్లను సాధించింది..ఓ ఐదు కోట్ల బజినెస్ తో బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన ఇక చిన్న సినిమాకు విదేశాల్లో ఈ రేంజ్ వసూళ్లు రావడమంటే అది సాధారణ విషయం కాదు..నిజం చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ఏ బాలీవుడ్ సినిమాకి దక్కని కలెక్షన్లు యూఎస్ లో జాతిరత్నాలు సినిమాకి దక్కడం నిజంగా విశేషమనే చెప్పాలి..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here