జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఎంత పాపులరైందో మీ అందరికీ తెలుసు. మరి జబర్దస్త్ షో ద్వారా పాపులరైన
గెటప్ శ్రీను అంటే తెలియని వారుండరు. బుల్లితెర కమల్ హాసన్‌గా పేరు పొందిన శ్రీను.. వేయని వేషం లేదంటే నమ్మాలి. జబర్ధస్త్ షోలో ది బెస్ట్ కామెడీ స్కిట్స్ చేస్తూ.. టాప్ టీమ్‌గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ టీమ్‌కు రైట్ హ్యాండ్ గా పేరు పొందాడు గెటప్ శ్రీను. అయితే ఇప్పుడు గెటప్ శ్రీనుగా అందరికీ పరిచయం ఉన్న ఈ శ్రీను తన కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ముఖ్యంగా టాలీవుడ్‌లోని ఓ నిర్మాత ఆయనని ఘోరంగా అవమానించాడట. వివరాల్లోకి వెళ్తే..

‘‘తన కెరీర్ ప్రారంభ దశలో వుండగా తన ఫ్రెండ్ చెప్పాడని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ చూడడానికి వెళ్లాడట. ఆ షూటింగ్ అయిన తర్వాత అక్కడే భోజనం పెడుతుంటే తను కూడా కూర్చున్నాడట. అయితే తను తినబోయే ముందు అటుగా వెళుతున్న నిర్మాత శ్రీనుని చూసి ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తూ.. ఇష్టం వచ్చినట్లుగా తిట్టి.. చేతిలో ఉన్న కంచం లాక్కుని అక్కడి నుంచి పంపించేశాడట. అంతే ఆ సీన్ తలుచుకుంటే చాలు ఇప్పటికీ తన కళ్లలో నీళ్లు వస్తుంటాయి’’ అని మన గెటప్ శ్రీను చెప్పుకొచ్చాడు. చదివారుగా.. గెటప్ శ్రీను అంతరంగంలోని ఆవేదనను.. మరి సినిమా రంగమంటే సుఖసంతోషాల సోపానమే కాదు.. కన్నీటి కష్టాల సుడిగుండమనే విషయం మీకీపాటికి అర్ధమయ్యే వుంటుంది.




























