టాలీవుడ్ లోని హీరో, హీరోయిన్లు, బుల్లితెర యాంకర్ల రెమ్యునరేషన్ గురించి ఫ్యాన్స్ లో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వారి రెమ్యునరేషన్ వివరాలను ఎప్పటికప్పుడు రహస్యంగానే ఉంచుతారు కాబట్టి. అయితే ఎంత రహస్యంగా ఉంచుదామని ట్రై చేసినా.. ఏదోక రకంగా ఆ వివరాలు లీకవుతూనే ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే..

బుల్లితెరపై గత కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షోలో కంటెస్టెంట్ల దగ్గర నుంచి జడ్జీల వరకు ఎవరెవరు ఎంతెంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనేది సాధారణంగా అందరికీ వచ్చే డౌట్. తాజాగా ఆ షోకు జడ్జీ వ్యవహరిస్తున్న రోజాతో పాటు కమెడియన్ల రెమ్యునరేషన్ వివరాలు లీకయ్యాయి. ఆ వివరాలేమిటో మీరే చదివి తెలుసుకోండి. కరోనా లాక్ డౌన్ తర్వాత మళ్ళీ ప్రారంభమైన ‘జబర్దస్త్’ షోను మెగా బ్రదర్ నాగబాబు వదిలి వెళ్లి పోవడంతో ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షోలో ఉన్నవాళ్ళ పంట పండిందట. ఈటీవీలో హయ్యెస్ట్ TRP రేటింగ్ తో దూసుకెళ్తున్న ‘జబర్దస్త్’ కామెడీ షోతో వందలాది మంది నటీ, నటులు సినీరంగానికి పరిచయమయ్యారు. వారానికి 2 రోజులు అన్నీ మరిచిపోయి ప్రేక్షకులను హాయిగా నవ్విస్తోంది ఈ షో. ఈ షోతో బాగా పాపులరైన కమెడియన్లు కూడా జీవితంలో సెటిలై పోయారు.

ఈ షోకు సంబంధించిమరో ట్విస్ట్ ఏమిటంటే.. మెగా బ్రదర్ నాగబాబు బయటికి వెళ్లిపోయిన తర్వాత మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ షోలో రెమ్యునరేషన్స్ కూడా భారీగా పెంచేసారట.

తాజాగా చేసిన మార్పుల ప్రకారం సినీ నటి రోజా ఒక్కో ఎపిసోడ్ కు కరోనా లాక్ డౌన్ ప్రకటించక ముందు వరకు 3 నుంచి 4 లక్షలు తీసుకునేదని, నాగబాబు వెళ్లిపోయిన తర్వాత ఈమెను ఆపడానికి ఆమె రెమ్యునరేషన్ డబుల్ ఇవ్వాల్సి వస్తోందని తెలిసింది. సో.. ఈ లెక్కన నటి రోజా ఈ జబర్దస్త్ షో ద్వారా నెలకు 8ఎపిసోడ్లకు 30 లక్షల వరకు సంపాదిస్తుందన్న టాక్ వినబడుతుంది.

ఇక రష్మి, అనసూయలు ఎపిసోడ్‌కు కరోనా లాక్ డౌన్ ప్రకటించక ముందు వరకు 50 నుంచి 80 వేలు అందుకునే వాళ్ళని, ఇప్పుడు మాత్రం లక్ష దాటేసిందని సమాచారం. వీళ్ల నెల ఆదాయం ప్రస్తుత లెక్కల ప్రకారం 4 నుంచి 5 లక్షల వరకు ఉంది.

ఇక టీమ్ లీడర్స్ విషయంలో చమ్మక్ చంద్ర అందరికంటే ఎక్కువగా నెలకు 4 లక్షలు తీసుకుంటారని తెలుస్తోంది. ముఖ్యంగా చమ్మక్ చంద్ర జీ తెలుగుకు వెళ్లొచ్చిన తర్వాత కూడా మంచి హైప్ ఇచ్చారని అంటున్నారు.

అలాగే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్‌కు కూడా రెమ్యునరేషన్స్ భారీగా పెంచేసారట. గతంలో ఒక్కో ఎపిసోడ్‌కు 3 నుంచి 3.5 లక్షలు అందుకున్న సుధీర్, ఇప్పుడు 5 లక్షల వరకు పెరిగిందట. హైపర్ ఆది రేట్ కూడా 3 నుంచి 4.5 లక్షలకు పెరిగిందంటున్నారు.

సాఫ్ట్ వేర్ నుంచి వచ్చిన అదిరే అభి 3 లక్షలు, జబర్దస్త్ కట్టప్ప రాకెట్ రాఘవ 3.5 లక్షలు, కిరాక్ ఆర్పీ 2.8 లక్షలు, భాస్కర్ అండ్ టీం 2 లక్షలు, రైటర్ కమ్ యాక్టర్ రాంప్రసాద్ 3 లక్షలు, చలాకీ చంటి 2 లక్షల వరకు తీసుకుంటున్నారట. ఇక సునామీ సుధాకర్, ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కూడా లక్షల్లోనే తీసుకుంటున్నట్లు తాజా సమాచారం.



























