జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది స్కిట్లకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ రోజురోజుకీ పెరుగుతుందన్న సంగతి నెటిజన్లకు తెలిసిందే.! జబర్దస్త్ షోలో స్కిట్ మొదలైన దగ్గర్నుండి ఆ స్కిట్ పూర్తయ్యే వరకు ప్రాసలు, పంచ్ డైలాగ్స్ , కొంటె మాటలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు ఆది. ఇక ఈమధ్య ప్రసారమైన జబర్దస్త్ షోలో హైపర్ ఆది తన స్థాయికి మించి ఓవరయ్యాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

ఈమధ్య అదేపనిగా జబర్దస్త్ జడ్జి రోజానే టార్గెట్ చేస్తున్నారు జబర్దస్త్ కమెడియన్స్. లేటెస్ట్ గా జబర్దస్త్ షోలో హైపర్ ఆది కూడా అదే చేశాడు. అయన స్కిట్ ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్కిట్ లో విషయం తక్కువ.. పంచ్ లెక్కువగా ఉంటువుంటాయి. ఒక్కోసారి అసలు కాన్సెప్ట్ లేకుండానే కామెడీని పండిస్తుంటాడు ఆది. ఇక తాజా స్కిట్ లో భాగంగానే ఈసారి మరీ దారుణంగా రోజానే టార్గెట్ చేశాడు హైపర్ ఆది. ఈసారి ఈయనగారు వేసిన జోకులకు రోజా కూడా తెల్లబోయింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే..

వచ్చే వారం ప్రోమోలో భాగంగా లేడీ కమెడియన్ గా నటి గీతా సింగ్ ని తీసుకొచ్చాడు ఆది. ఆమెను పెళ్లి చేసుకున్నట్లుగా స్కిట్ చేశాడు. పదండి.. రోజా గారి దగ్గరికి వెళ్దామని గీతా అడిగిన వెంటనే ఇప్పుడే కదా పెళ్లైంది.. అప్పుడే ఆవిడ దగ్గరికి ఎందుకు.? దానికింకా టైమ్ ఉంది అంటూ ఆది పంచ్ వేసాడు. అదేంటి అంటే అదంతే.. ఆమె దగ్గరికి వెళ్ళాలంటే గొడవలు కావాల్సిందే అంటూ పంచ్ వేశాడు హైపర్ ఆది.
ఎందుకు అవుతాయి అంటే అనసూయ కారణంగానే మనిద్దరం వెళ్లి రోజా గారి ముందు కూర్చోవాలంటాడు. ఆమె మధ్యలో ఉంటుంది.. నువ్వోవైపు నేనోవైపు కూర్చుని బాధలు చెప్పుకోవాలంటూ బతుకు జట్కా బండి కార్యక్రమాన్ని గుర్తు చేస్తూ అదిరిపోయే సెటైర్లు వేసాడు హైపర్ ఆది.

ఒక్కసారిగా ఆది అలా పంచ్ లేయడంతో జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా సడెన్ గా షాక్‌కు గురయ్యారు. అతడేంటి ఇలా పంచ్ లేస్తున్నాడని ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. హైపర్ ఆది చేసిన ఓవర్ యాక్షన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. జడ్జి హోదాలో ఉన్న వ్యక్తిపై అలాంటి పంచ్ లేస్తావా.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి హోదాలో ఉన్న వ్యక్తి గురించి అలా ఎలా పంచ్ లు వేస్తాడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.



























