జబర్దస్త్ కామెడియన్లు తెర మీద తమ నవ్వులతో మన అందరినీ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు కానీ… వారి నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఆ స్థాయికి చేరుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఎందరో కమెడియన్స్ జబర్దస్త్ కామెడీ షోకి వచ్చాక ఆర్థిక పరంగా మెరుగు పడ్డారు. అంతే కాదు మంచి వెండితెరపై వెలుగుతున్నవారు కూడా ఉన్నారు.. ఎంతో మందికి జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. అలాంటివారిలో జబర్దస్త్ లో నటిస్తున్న శాంతి స్వరూప్ ఒకడు. అసలు ఇతనిని లేడీ గెటప్ లోనే చాలా మంది గుర్తు పడతారు. ఎక్కువగా లేడీ గెటప్ లు వేస్తూ జబర్దస్త్ లో తన కంటు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శాంతి స్వరూప్. ఇతడు జబర్దస్త్ షోలో అబ్బాయిగా నటించిన స్కిట్ లు చాలా తక్కువ. హైపర్ ఆది టీమ్ లో ఎక్కువగా లేడీ గెటప్ లోనే స్కిట్ లు చేస్తూ ఉంటాడు. జబర్దస్త్ కాకుండా వేరే ఇవెంట్స్ లో కూడా శాంతి స్వరూప్ లేడీ గెటప్ లోనే కనిపించడం విశేషం. అబ్బాయిగా అతడు ఎవరు అనేది కూడా ఎవరు గుర్తుపట్టలేరు. అంతగా లేడీ గెటప్ లు చేసాడు శాంతి స్వరూప్.

అయితే ఈ మధ్య శాంతి స్వరూప్ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా ప్రచారంలోకి వచ్చింది. అదే శాంతి స్వరూప్ జబర్దస్త్ కి రాక ముందు నుండి కోట్ల ఆస్తులు ఉన్నాయి అని, ఆడి కారు కూడా ఉందని, అతడు కోటీశ్వరుడు అని ఒక న్యూస్ వైరల్ అవుతోంది. కొందరు అయితే అది నిజమని నమ్ముతూ, అతనికి నటన అంతే ఇష్టం అందువల్లే జబర్దస్త్ షోలో చేస్తున్నాడు అని చెప్తున్నారు.

ఈ ప్రచారానికి తెర దించడానికి శాంతి స్వరూప్ తన యొక్క జీవితం గురించి చెప్పుకొచ్చాడు. అస్సలు తనకు కోట్ల ఆస్తులు లేవని, ఆడి కారు కూడా లేదని, కుటుంబాన్ని చూసుకోవడానికే సరైన సంపాదన లేదని, ఒక్కోసారి రూం రెంట్ కూడా కట్టలేని పరిస్తితి, తినడానికే సంపందించడం కష్టం అవుతుంటే ఇటువంటి పుకార్ల తీసుకు రావొద్దని వేడుకున్నాడు. అంతే కాకుండా ఆ పుకార్లు రావడానికి కారణం ఎంటో కూడా చెప్పాడు. శాంతి స్వరూప్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటో వల్ల ఇటువంటి పుకార్లు వచ్చాయని, ఆ ఫోటో తను జబర్దస్త్ కి రాకముందు ఒకరి ఇంట్లో పనిచేశాను అని, ఆ సమయంలో తాను పనిచేసిన ఇంట్లో వారి కారు దగర తీసుకున్న ఫోటో అని క్లారిటీ ఇచ్చాడు. ఆ ఫోటో పెట్టినప్పటికీ తనకు అంత గుర్తింపులేదని, ఇపుడు దానిని ఇలా వాడుతున్నారు అని చెప్పాడు.


































