Jabardasth : జబర్దస్త్.. బుల్లితెర మీద ప్రసారమవుతూ ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న ప్రోగ్రాములలో ఇది కూడా ఒకటి. అయితే ఈ మధ్య ఈ ప్రోగ్రాముకు కాస్త కళ తప్పింది అనే చెప్పుకోవాలి. షో నుండి సుడిగాలి సుధీర్, ఆది, అనసూయ ఇలా ఒకొక్కరుగా వెళ్లిపోయారు. ఇక మంత్రి పదవి చేపట్టిన తరువాత రోజా కూడా వెళ్లిపోవడం, నాగ బాబు ప్లేస్ లో వచ్చిన సింగర్ మనో కూడా వెళ్లిపోవడం తో తీరని లోటు ఏర్పడింది. అయితే ప్రస్తుతం రోజా మనో ప్లేస్ లో ఇంద్రజ, ఖుష్బు సెటిల్ అయినట్టే కనిపిస్తుంది. ఇపుడు జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ రెండిట్లోను ఎపిసోడ్ కు చంటి, రాఘవ, రామ్ ప్రసాద్, భాస్కర్, కార్తిక్, రాకేష్ లాంటి వాళ్ళు నాలుగు స్కిట్ల చొప్పున లాగించేస్తున్నారు.

జబర్దస్త్ కు పూర్వ వైభవం…
శుక్రవారం రాత్రి ప్రసారం అయిన ఎపిసోడ్ కు ప్రమోషన్లో భాగంగా ‘రంగ రంగ వైభవంగా’ టీం అయిన వైష్ణవ్ తేజ్, కేతిక, దర్శకుడు గిరీశాయ వచ్చారు. అయితే ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు జబర్దస్త్ టీం అందరూ వినాయక చవితి పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక అందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకి వెళ్తాము అని, అన్నీ టీంలు విజయం సాధించాలి, జబర్దస్త్ మళ్ళీ నెంబర్ వన్ ప్లేస్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నట్లు గెటప్ శీను అన్నారు.

తరువాత రామ్ ప్రసాద్ మాట్లాడుతూ… ఎవరు అన్నారు జబర్దస్త్ పని ఇంక అయిపోయింది అని, మేము కొత్తగా చేస్తాము. బయట చాలా రూమర్లు వస్తుంటాయి. మేము అందరమూ కష్టపడతాము అని అన్నారు. ఈక్రమంలోనే భాస్కర్, రాకేష్, రష్మీ లు కూడా జబర్దస్త్ ను నెంబర్ వన్ ప్లేస్ లో నిలబెట్టి చూపిస్తాం అని స్టేజి మీద శబధం చేశారు. నిన్న టెలికాస్ట్ అయిన ఈ ఎపిసోడ్ అందరినీ ఆకట్టుకుంది.































