Jabardasth Anand : జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ లైంలైట్ లోకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుని కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక కోణం అయితే మరో కోణం, కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా నేమ్ ఫేమ్ సంపాదించుకున్న తరువాత జబర్దస్త్ నుండి తీసేయడం వల్ల వేరే అవకాశాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్యలను పేస్ చేస్తున్న వారిలో జబర్దస్త్ ఆనంద్ కూడా ఒకరు. జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర స్కిట్స్ లో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ చంద్ర వెళ్ళిపోయాక టీం లీడర్ గా కొనసాగాడు. అయితే రేటింగ్స్ తన స్కిట్స్ కి రాలేదని టీం లీడర్ గా తీసేసి కంటెస్టెంట్ గా పెట్టారు.

టీం లీడర్లకు లక్షల్లో రెమ్యూనరేషన్స్ ఉంటాయి…
జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా కూడా ఇతర టీం వాళ్ళు ఆనంద్ ను పెట్టుకోకపోవడంతో తాను ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఖాళీగా ఉండటం కంటే బయట ఏదైనా పని చూసుకుంటే మంచిదని బయటికి వచ్చేసిన ఆనంద్ ఆపైన పెద్దగా అవకాశాలు లేక ఇబ్బంది పడ్డాడు. ఇక జబర్దస్త్ లో రెమ్యూనరేషన్స్ ఎలా ఉంటాయి అన్న ప్రశ్నకి దాదాపు చాలా మంది కంటెస్టెంట్స్ ఇల్లు కట్టుకోవడం కార్లు కొనుక్కోవడం చేసారు. ఈ విషయం గురించి చెబుతూ టీం లీడర్స్ అది కూడా మంచి రేటింగ్స్ తో ఉన్న వాళ్లకు లక్షల్లో పేమెంట్స్ ఉంటాయి అని చెప్పారు.

చమ్మక్ చంద్ర ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవాడు అంటూ చెప్పారు. అయితే అది రేటింగ్స్ ని బట్టి నిర్ణయిస్తారు, మొదట వచ్చినపుడు వాళ్ళే ఇంత పేమెంట్ అని ఫిక్స్ చేస్తారు, టీం లీడర్ కి అయితే యాభై వేలు, కంటెస్టెంట్ కి అయితే 1000 రూపాయలు ఇస్తారు. వాళ్ళ కామెడీకి రేటింగ్స్ బాగా వస్తే పెంచుతారు అలా 10,000 నుండి 20,000 దాకా తీసుకునేవాళ్ళు కూడా ఉన్నారు అంటూ చెప్పారు. తాను స్కిట్స్ కి చంద్ర టీంలో ఉన్నపుడు 15,000 దాకా ఒక స్కిట్స్ కి తెసుకునే వాడిని అంటూ చెప్పారు.































