బుల్లితెరపై తనకంటూ ఓ కామెడీ యాంగిల్ లో దూసుకుపోతున్నాడు ముక్కు అవినాష్. అతడు మొదట జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యాడు. తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి మరింత అభిమానులను సంపాదించుకున్నాడు.

బిగ్ బాస్ లోకి వెళ్లిన దగ్గర నుంచి కూడా తన కామెడీ తో ఆ హౌస్ లోనే కాదు చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించాడు. అయితే అతడి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా అతడు నిశ్చితార్థం చేసుకున్నట్లు.. ఆయన తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకున్నారు.

మన జీవితంలోకి రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఏ మాత్రం వెయిట్ చేయోద్దు. మా ఫ్యామిలీలు కలిసాయి. మేము కలిసాం. అందుకు వెంటనే ఎంగేజ్ మెంట్ కూడా అయిందంటూ.. అతడు ఇన్ స్టాగ్రామ్ లో చెప్పుకొచ్చాడు. తన కాబోయే భార్య పేరు అనూజ అంటూ కూడా అందులో రాశాడు. మీ ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటున్నానంటూ అతడు తెలిపాడు.
అతడు ఫొటోలు షేర్ చేయగా వాటికి లక్షల్లో లైక్ లు వచ్చాయి. అందులో శ్రీముఖి, సుజాత, ఆర్జె చైతూ లాంటీ వారు లైక్ లు కొడుతూ.. శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఈ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతున్నాయి. ఓ టీవీ షోలో వస్తున్న ‘పల్లకిలో పెళ్లి కూతురు’ అనే ప్రోగ్రాంలో అవినాష్ తన భార్యను పరిచయం చేశారు.






























