Jabardasth Dorababu : జబర్దస్త్ ఎంతో మంది కేర్ అఫ్ లేనివాళ్లకు స్టార్ డమ్ ఇచ్చింది. కమెడియన్స్ గా గుర్తింపునిచ్చింది. ఈ షో ద్వారా ఎంతో మంది నేడు సినిమాలలో చిన్న పెద్ధ పాత్రలతో బిజీగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక చాలా మంది జబర్దస్త్ నుండి వెళ్ళిపోయి వేరే ఛానెల్స్ లో చేస్తుంటే మరికొంతమంది సినిమాలలో బిజీ అయిపోయారు. కానీ జబర్దస్త్ లోనే ఇప్పటికీ కొనసాగుతున్న కమెడియన్స్ లో ఒకడు దొరబాబు. హైపర్ అది టీంలో ఫేమస్ అయిన దొరబాబు షోలో హైపర్ అది తన మీద వేసే వ్యక్తిగత పంచుల మీద మాట్లాడారు.

మేము ముందే అనుకుని అలాంటి పంచులు ప్లాన్ చేస్తాం…
హైపర్ అది టీంలోని దొరబాబు అలానే పరదేశి ఇద్దరూ వైజాగ్ లో ఒక కేసులు పోలీసులకు దొరకడం అన్నీ కూడా యూట్యూబ్ లో బాగా వైరల్ అయ్యాయి. ఆ ఇష్యూ తరువాత వారు మళ్ళీ జబర్దస్త్ కి రారేమో అని చాలా మంది భావించినా హైపర్ ఆది మాత్రం వారిని టీం లో కొనసాగించాడు. ఇక ఆ కేసు ఇష్యూనే కామెడీగా మార్చేశాడు.

ప్రతి స్కిట్ లోనూ ఆ కేసు గురించి దొరబాబు, పరదేశిలకు పంచులేసేవాడు. దీని గురించి దొరబాబు మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఏమీ ఉండవు, ముందుగానే ప్లాన్ చేసుకునే స్కిట్ లో పంచులు రాసుకుంటాం అంటూ మేమేమి ఆ పంచులకు ఫీల్ అవ్వము, పర్సనల్ గా తీసుకోము అంటూ వివరించాడు.



































