Jabardasth gaddam naveen : ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వాళ్ళు ఎందరో అయితే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉంటూ చిన్న చిన్న వేషాలు వేస్తున్నా మంచి గుర్తింపు అందుకుని కెరీర్ లో ఎదిగినవారు ఉన్నారు. జబర్దస్త్ వల్ల అటు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా సినిమాల్లో మంచి అవకాశాలను కూడా అందుకుంటున్నారు చాలా మంది కమెడియన్స్. అలా జబర్దస్త్ వచ్చి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జబర్దస్త్ నవీన్. అంతకు ముందు సినిమాల్లో ఎన్నో పాత్రలు చేసినా రాని గుర్తింపు జబర్దస్త్ వల్ల బాగా వచ్చింది నవీన్ కి. ఇక తన జబర్దస్త్ ఎంట్రీ కెరీర్ గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అభి మొదట అవకాశం ఇచ్చాడు…
ఆది, దిల్, అశోక్ వంటి సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నవీన్ ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాను అంటూ చెప్తున్నారు. ఇక మొదట అవకాశం ఇచ్చి సినిమాల్లో గుర్తింపు తీసుకోచ్చింది డైరెక్టర్ సురేంధర్ రెడ్డి గారంటూ చెప్పారు. సినిమాల్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసినా ఎక్కువ శాతం రౌడీ షీటర్ పాత్రలను చేశానంటూ చెప్పారు. ఇక సినిమాల్లో చేస్తున్నపుడు జబర్దస్త్ లో మొదట్లో వస్తోన్న ఫణి అనే కమెడియన్ తో అంతకు ముందు కలిసి పనిచేయడం వల్ల ఒక స్కిట్లో చిన్న వేషం చేస్తావా అని అడిగితే అలా జబర్దస్త్ చేసాను.

ఆ స్కిట్స్ బాగా రావడం వల్ల ఆ తరువాత అభి తో కంటిన్యూ అయ్యాడట నవీన్. అలా అభి గారు మొదటి చెక్ ఇచ్చారట. అయితే డైలాగులు చెప్పాలంటే భయం అందుకే తక్కువ మాటలున్న స్కిట్లను మొదట్లో చేసేవాడిని అంటూ చెప్పారు. ఇక అభి తరువాత చంటి తో పనిచేసిన నవీన్, చలాకి చంటి చాలా క్లోజ్ అంటూ చెప్పారు. ఇద్దరం బ్రదర్స్ లాగా ఉంటామంటూ, సినిమాల్లో కూడా కలిసి నటించడం వల్ల ఇంకా చనువు పెరిగిందని ఆయనకు దాదాపు 60 ఎపిసోడ్స్ పైగా చేసాక చంటి జబర్దస్త్ మానేయడంతో ఇక మళ్ళీ అభి టీంకి వెళితే ఇప్పటి వరకూ వెనక్కి తిరిగి చూసుకోకుండా బిజీ అయ్యాను అంటూ చెప్పారు.































