Kirak RP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన విషయం పక్కన పెట్టి సోషల్ మీడియా వేదికగా వారిని హింసించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారని వైకాపా నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మహిళా మంత్రి ఆర్కే రోజా ఇటీవల సోషల్ మీడియా వేదికగా తనని తన కూతురిని ఎంతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ ఒక వీడియో విడుదల చేశారు అయితే ఈ వీడియో పై కిరాక్ ఆర్పీ స్పందించారు.

ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ.. మహిళనీ కూడా చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని రోజ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి గురించి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు ఒక సాటి మహిళగా నువ్వు అక్కడే ఉండి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. మీరొక్కరే ఆడవారా మీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా అంటూ ఆర్పీ ప్రశ్నించారు.
నేను డబ్బు కోసం ఎవరిని తిట్టడం లేదు నేను పక్కాగా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అభిమానిని ఇటీవల రెండుసార్లు లోకేష్ గారిని కలిసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఫలానా వాళ్ళని బూతులు తిట్టమని నన్ను ప్రోత్సహించలేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడే నేను ఎవరికీ భయపడలేదు మీకు చెమటలు పట్టించాను. ఇప్పుడు కూడా తాను ఎవరికి భయపడనని ఆర్పీ తెలిపారు.
భయపడేదే లేదు..
రోజాని నేను పంది అన్నప్పుడు అంబంటి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. మరి రోజా పవన్ కళ్యాణ్ గాడిద అని తిట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటూ అంబంటికి కూడా ఈయన ప్రశ్నలు వేశారు.నీవు ఒక జంతువును వాడితే.. నేను ఒక జంతువుతో పోల్చకూడదా? అని కిర్రాక్ ఆర్పీ తెలిపాడు.































