ఈటీవీలో వస్తున్న ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షో గురించి తెలియని ప్రేక్షకులుండరు. ఈ షోలో మోస్ట్ పాపులర్ కమెడియన్ నరేష్ వేసే పంచ్ లకూ, అతని కామెడీ టైమింగ్ కి మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. చూడటానికి మిరప కాయ్ లా ఉన్నా కూడా ఆయన పేల్చే కామెడీ పంచ్ లు మాత్రం చాలా ఘాటుగానే ఉంటాయి. తాజాగా అయన ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.. దీనికి సంబంధించిన విడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ టీవీలో సుమ కనకాల యాంకర్ గా వ్యవహరిస్తున్న ప్రోగ్రాం “క్యాష్” ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రతి శనివారం పలు సెలబ్రేటీలు ఈ ప్రోగ్రాం కు అతిధులుగా వచ్చి సందడి చేస్తుంటారు. తాజగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో భాగంగా నాలుగు జంటలు అతిధులుగా వచ్చాయి. ఒక టాస్క్ లోని తమ జంటగా వచ్చిన వారికి ప్రపోజ్ చేయాలి. అయితే జబర్దస్త్ పొట్టి నరేష్ మాత్రంగా యాంకర్ సుమ కి ప్రపోజ్ చేస్తాడు. దీనికి సుమ ఒప్పుకోలేదు.

కానీ ప్రోమో చివరిలో మాత్రం మీరు ఒప్పుకోకపోతే నేను కిందికి దూకేస్తా అంటూ స్టేజి చివరికి వెళ్లి బెదిరిస్తాడు. అలా ఒక్కసారిగా కాలు జారి కిందికి పడిపోతాడు. ఒక్కసారిగా జరిగిన ఈ సంఘనతో యాంకర్ సుమతో పాటూ అందరూ షాక్ కు గురవుతారు. ఆ తరువాత అంబులెన్స్ వచ్చినట్టుగా సౌండ్ కూడా వినిపిస్తుంది. అయితే ఇది కేవలం ప్రోమో కోసమే అలా చేసారా.. లేక నిజంగానే ప్రమాదం జరిగిందా అనేది తెలియాలి అంటే మాత్రం ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.






























