Jabardasth Rajamouli : ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఎంతోమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చింది. జబర్దస్త్ ద్వారా ఎంతో మంది నేడు సినిమాల్లో చేస్తున్నారు. ఇల్లు కార్లు కొనుక్కొని మంచి. జీవితంలో ఉన్నారంటే కారణం జబర్దస్త్. తెలుగు బుల్లి తెరపై చాలా ఏళ్లుగా రేటింగ్స్ లో నెంబర్ వన్ గా కొనసాగుతూ ప్రేక్షకులను నవ్విస్తోంది జబర్దస్త్. చాలా మంది జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయి ఇపుడు ఇతర ఛానెల్స్ లో షోలకు వెళ్లిపోతున్నారు. ఇక కొత్తవాళ్లు మళ్ళీ జబర్దస్త్ కు వస్తున్నారు. కానీ జబర్దస్త్ వైభవం ఎక్కడ తగ్గలేదు, మసకబారలేదు.

సుధీర్ పై పంచులేస్తే…
ఇక జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన చాలా మంది కమెడియన్స్ లో తాగుబోతు రాజమౌళి ఒకడు. తాగుబోతు పాత్రతో చాలా స్కిట్స్ చేసి నవ్వించారు రాజమౌళి. తెలంగాణ కి చెందిన రాజమౌళి టీచర్ గా పనిచేస్తున్నా నాటకాలు వేసేవారట. ఇక జబర్దస్త్ లో అవకాశం వచ్చాక వేణు టీం లో చేసాడు, ఆపై భాస్కర్ టీం అలా చాలా స్కిట్లు చేస్తూ వచ్చాడు. ప్రతి స్కిట్స్ లోనూ తాగుబోతుగా నటించడమే కాకుండా పేరడీ పాటలు పడటంలో దిట్ట. ఇక ప్రతి స్కిట్స్ లో ఈరోజు రాజమౌళి ఏ పాటను పేరడి చేస్తాడా అని ఎదురుచూసే వాళ్ళు అలా అందరిని ఆకట్టుకున్నాడు రాజమౌళి. ఇక రాజమౌళి జబర్దస్త్ లోని అనుభవాలను పలు ఇంటర్వ్యూ ల్లో చెబుతూ సుధీర్ గురించి ప్రస్తావించారు. బుల్లితెర పవర్ స్టార్ అంటూ అభిమానులు అనుకునే సుధీర్ చాలా నిజాయితీ గల వ్యక్తి అని అతని పై పంచులు రాసినా పర్వాలేదు చేస్తా అని అంటాడు.

అంత ఇమేజ్ ఉన్నా ఏ మాత్రం ఆటిట్యూడ్ చూపించడు అంటూ పొగిడాడు. ఇక హైపర్ ఆది మాటల మాంత్రికుడు అంటూ పొగిడాడు. కొన్నివేల స్కిట్లకు స్క్రిప్ట్ అందించిన రాజ్ కుమార్ గురించి మాట్లాడారు. చాలా బాగా స్క్రిప్ట్ రాసినా ఏ రోజు ఆ ఘనత ఆయన తీసుకోరని చాలా సింపుల్ గా ఉంటారని చెప్పారు. ఇక రాజమౌళి తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నాడు. తనది ప్రేమ మరియు పెద్దలు చేసిన పెళ్లి అని చెప్పాడు. తనకు బంధువే అయిన ఆ అమ్మాయే తనను ఇష్టపడి పెళ్లి చేసుకుందని చెప్పాడు.



































