Jabardasth Rakesh & Sujatha : జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి గుర్తింపుతో నేమ్ ఫేమ్ తో సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ఇక అలా జబర్దస్త్ లో అడుగుపెట్టి ప్రస్తుతం అందులో టీం లీడర్ గా ఉంటూ మరో వైపు సినిమాల్లో కూడా చేస్తున్న కమెడియన్ రాకింగ్ రాకేష్. ఇక జోర్ధార్ వార్తలు చదువుతూ ఫేమస్ అయింది సుజాత. రాకేష్ సుజాత ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో పరిచయం అయి ఆ తరువాత ప్రేమించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి పలు షోలలో సందడి చేస్తున్న వీరు తాజాగా ఈటీవీ లో ప్రసారమయ్యే మిస్టర్ అండ్ మిస్సెస్ షోలో పాల్గొన్నారు.

ఆ విషయంలో హర్ట్ అయిన రాకేష్…
ఈటీవీ లో కొత్తగా మొదలయిన మిస్టర్ అండ్ మిస్సెస్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. శ్రీముఖి యాంకర్ గా వస్తోన్న ఈ షోలో సెలబ్రిటీ కపుల్స్ పాల్గొని ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇక షోలో జడ్జెస్ గా స్నేహ, అలాగే శివ బాలాజీ ఆకట్టుకున్నారు. అయితే షోకి సంబందించిన లేటెస్ట్ ప్రోమో విడుదల అవ్వగా అందులో రాకేష్, సుజాత మధ్య ఏదో గొడవ జరిగిందనే విధంగా చూపించారు. కపుల్స్ ని రకరకాల ప్రశ్నలు అడుగుతూ శ్రీ ముఖి కంటెస్టెంట్స్ ను ఇరుకున పెడుతూ ఉండగా చివర్లో రాకేష్ అలాగే సుజాత లను కూడా ప్రశ్నలు అడిగింది. అందులో ఒకరికి కళ్ళకు గంతలు కట్టి ఒక ప్రశ్న ఇద్దరికీ వేసినపుడు ఇద్దరూ ఒకేలాంటి ఆన్సర్ ఇస్తారా లేదా అన్నది గేమ్.

అందులో రాకేష్ కళ్ళకు గంతలు కట్టి ఇద్దరినీ రాకేష్ స్కిట్స్ లో నవ్వు రాకపోయినా సుజాత నవ్విన సందర్భాలు ఉన్నాయ అని ప్రశ్నించినపుడు ఇద్దరూ నో చెప్పారు. రాకేష్ మాట్లాడుతూ ఊరికే నవ్వేస్తుంటుంది నా స్కిట్స్ వస్తే చాలు అంటూ చెప్పాడు. ఇక శ్రీముఖి మరో ప్రశ్న అడుగుతూ రాకేష్ వాట్సాప్ మెసేజెస్ ఎపుడైనా సీక్రెట్ గా చూసావా అని సుజాతను అడుగగా, రాకేష్ తనకు నాకు ఈ విషయంలో గొడవ జరిగింది. నా మెసేజెస్ చూస్తుంది అంటూ చెప్పినపుడు సుజాత ఎమోషనల్ అవడం, రాకేష్ కి సుజాత కు మధ్య ఏదో జరిగింది అన్నట్లు గా ప్రోమో ఎండ్ చేసారు. నిజానికి ఏం జరిగిందో తెలియాలంటే మంగళవారం రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

































