వరల్డ్ వైడ్ గా ఆడవారు మగవారి మధ్య ఉన్న ఆకర్షణ అనే యాక్టివిటీ చూసే వారికి ఎంతో ఆసక్తి కలిగిస్తుంది.. అది ఈటీవీ పాటిస్తూ దాన్ని కమర్షియల్ చేసేసింది.. బుల్లితెరపై కొన్ని జంటలు ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి. సుధీర్ రష్మీ,ర్షిణి, హైపర్ ఆది,, అఖిల్ మోనాల్, అవినాష్ అరియనా.. ఇలా బుల్లితెరపై ఈ జోడీలు ప్రేక్షకులను ఎంతో అలరిస్తాయి. అయితే ఇది గమనించిన ఛానల్స్ కూడా దాన్ని హైలైట్ చేస్తూ వారిపై ప్రోగ్రామ్స్ ని చేస్తున్నాయి. అవి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో వారు నిజజీవితంలో కూడా నిజంగా లవ్ చేసుకుంటున్నారా అన్న డౌట్ అందరికి వస్తుంది.. దీనిపై వారు ఎంత క్లారిటీ ఇచ్చినప్పటికీ షో లలో లవర్స్ మాదిరి నటిస్తుండడం తో ప్రేక్షకులు వాళ్ళ మధ్య ఏం లేదు అని ఎలా నమ్ముతారు..ఇకపోతే ఇప్పుడిప్పుడే బుల్లితెరపై ఫేమస్ అవుతున్న జంట వర్ష ఇమ్మానుయేల్..

జబర్దస్త్ షో లో వీరి రొమాన్స్ చూస్తుంటే నిజంగానే వీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారా అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఒకానొక సందర్భంలో వీరిద్దరూ లైన్ క్రాస్ చేసేంత రొమాన్స్ లోకి దిగిపోయారు. షో లో వర్ష ఇమ్మానుయేల్ ఇద్దరూ కలిసి మంచి కెమిస్ట్రీనే పండిస్తున్నారని, సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. బయట కూడా ఇదే కొనసాగుతుందని అంటున్నారు చాలామంది. అయితే వర్ష జీవితంలో ఓ పెద్ద విషాదం ఉంది. గుండె పగిలిపోయేంత విషాదం ఉంది. కన్నీళ్లు ఆరనటువంటి బాధ ఉంది.
ఎప్పుడూ నవ్వించే వర్ష ఉన్నట్టుండి అందరిచేత కన్నీళ్లు పెట్టించింది. తన ఫ్యామిలిలో జరిగిన విషాదం చెప్పి బోరున విలపించింది. తన తండ్రి ఇటీవల కన్నుమూశారట. ఈ విషయాన్ని వెల్లడించి అందరి చేత కన్నీళ్లు పెట్టించింది వర్ష. అయితే దాన్ని మాటల రూపంలోకాదు, స్కీట్ రూపంలో..`శ్రీదేవి డ్రామా కంపెనీ`లో వర్ష కంటెస్టెంట్‌గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆమె తాజా ఎపిసోడ్‌లో తమ కుటుంబంలో జరిగిన విషాదాన్ని వెల్లడించింది.ఆ విషయాన్ని `నాన్నకి ప్రేమతో` అంటూ స్కిట్ రూపంలో చేసి చూపించింది. తనకు నాన్నంటే ఎంత ప్రేమనో కళ్లకి కట్టినట్టు చూపించింది. తండ్రితో తనకున్న అనుబంధాన్ని వెల్లడించింది.



























