Jabardasth Vinod : జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ లైం లైట్ లోకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుని కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక కోణం అయితే మరో కోణం కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా నేమ్ ఫేమ్ సంపాదించుకున్నా ఆ తరువాత జబర్దస్త్ నుండి వెళ్లిపోయినవారు ఉన్నారు. మొదటి నుండి జబర్దస్త్ అనగానే బాగా ఫేమస్ అయింది మాత్రం లేడీ గేటప్స్ వేసేవాళ్ళు. ఈ షో ద్వారా లేడీ గెటప్స్ వేసే వినోదిని, సాయి, పావని వంటి వారు మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా వీరిలో వినోద్ ను అందరూ అమ్మాయి అనే అనుకుని పొరపాటు పడ్డారు. చమ్మక్ చంద్ర టీంలో చంద్ర కి పెయిర్ గా ఎన్నో స్కిట్స్ చేసిన వినోద్ జబర్దస్త్ కి క్వీన్ అని చెప్పొచ్చు.

అనారోగ్యంతో బాధపడుతున్న వినోద్…
చమ్మక్ చంద్ర, వినోదిని పెయిర్ అనగానే ఎన్నో హిట్ స్కిట్స్. జబర్దస్త్ ను నిలబెట్టిన ఎన్నో స్కిట్స్ వీళ్ళిద్దరివే. ముఖ్యంగా స్కిట్స్ మొదట్లో వీళ్ళు వేసే డాన్స్ కి కూడా ఫ్యాన్స్ ఉండేవాళ్లు. అయితే వినోద్ జబర్దస్త్ వీడాక టీవీ లో కనిపించడం తగ్గిపోయింది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాగా చిక్కిపోయి కనిపించాడు వినోద్. ఊపిరి తిత్తుల్లో నీరు చేరడం వల్ల ఉన్నట్లుంది బరువు తగ్గిపోయి అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రి లో చికిత్స తీసుకున్నట్లు ఇంజెక్షన్స్ ద్వారా ఊపిరి తిత్తుల్లో నీరు తీసేసినట్లు తెలిపాడు.

ఇక వినోద్ కు విజయలక్ష్మి తో పెళ్లి జరిగి ఒక పాప పుట్టింది. విజయలక్ష్మి తన భర్త ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉన్నట్లుంది బరువు తగ్గడం తో ఏమయిందని హాస్పిటల్ లో చూపిస్తే ఇలా జరిగింది. ఎక్కువగా ప్రయాణాలు చేయడం, బయట ఫుడ్ తినడం వల్ల ఇలా జరిగింది అయితే సకాలంలో చికిత్స చేయించుకోవడం వల్ల ఇప్పుడు కోలుకున్నారు అంటూ ఎమోషనల్ అయింది.































