Jabardasth: జబర్దస్త్ కార్యక్రమం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ కార్యక్రమం పేరు మారుమోగిపోతుంది.ఈ విధంగా ఈ కార్యక్రమం వార్తల్లో నిలవడానికి గల కారణం కేవలం కిరాక్ ఆర్పీ చేసిన సంచలన వ్యాఖ్యలే అని చెప్పాలి.జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న కిరాక్ ఆర్పి ఆ కార్యక్రమం నుంచి బయటకు వస్తూ ఆ కార్యక్రమం పై ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది.

ఇకపోతే ఆర్పీ చేసిన వ్యాఖ్యల వల్ల జబర్దస్త్ కార్యక్రమం తో సంబంధం ఉన్న వారందరూ ఒక్కొక్కరుగా ఈ కార్యక్రమం పై స్పందిస్తూ తమదైన శైలిలో వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమంలో ఒకప్పుడు మేనేజర్ గా వ్యవహరించినటువంటి ఏడుకొండలు ప్రస్తుతం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టడమే కాకుండా సుడిగాలి సుదీర్ గెటప్ శీను వంటి వారిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ జడ్జిలుగా ఉన్నటువంటి నాగబాబు రోజా రెమ్యూనరేషన్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోజా నాగబాబు రెమ్యునరేషన్ విషయంలో ఎందుకు తేడాలు ఉన్నాయి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఏడుకొండలు సమాధానం చెబుతూ నాగబాబుతో పోలిస్తే రోజా గారికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చే వాళ్ళం అని చెప్పారు అలా రోజాకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి గల కారణం కూడా ఈయన వివరించారు.

రోజా హీరోయిన్ కనక ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చాము…
రోజా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే ఆమెకు హీరోయిన్ రేంజ్ రెమ్యూనరేషన్ ఇచ్చాము. ఇక నాగబాబు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అందుకే ఆయనకు అదే స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చామని ఏడుకొండలు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా నాగబాబు రోజా రెమ్యూనరేషన్ మధ్య పోలికను ఏడుకొండలు చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.




























