Jabardasth : వెండితెర మీద బుల్లితెర మీద చాలామంది నటీ నటులు మనకు వినోదాన్ని పంచుతూంటారు. అయితే స్టార్ హీరో అయినా సరే ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా సరే వాళ్ళకంటూ వాళ్లకి అభిమానులు ఉంటారు. ఆ అభిమానులు తమ కిష్టమైన నటీనటుల మీద ఎనలేని ప్రేమ చూపిస్తుంటారు. అభిమాన నటీనటులను పుట్టిన రోజులు అయితే వీరి పుట్టినరోజులు కన్న ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ఇష్టమైన నటీనటుల పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు అన్నదానాలు ఇలా ఒకటేమిటి చాలా హంగామా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటిదే ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో చోటు చేసుకుంది.

ఒక అభిమాని తనకిష్టమైన హాస్యనటుడు మీద ఎనలేని అభిమానాన్ని చూపించాడు. ఆ నటుడు ఎవరో కాదు శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లో తన పంచులతో అలరిస్తున్న పంచ్ ప్రసాద్. అయితే పంచ్ ప్రసాద్ కు ఇదివరకే కిడ్నీ సమస్య వుంది, ఆ కిడ్నీ సమస్యను కూడా పంచ్ ప్రసాద్ హాస్యానికి ఉపయోగించి ప్రేక్షకులను నవ్విస్తారు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం సాక్షిగా ఒక అభిమాని తనకిష్టమైన హాస్య నటుడు అయిన పంచ్ ప్రసాద్ కిడ్నీ ఇస్థానని ఒక వీడియో ద్వారా తెలియజేశారు.
అభిమాన హాస్య నటుడి కోసం ఏకంగా కిడ్నీ ఇస్తానంటూ…..
జబర్దస్త్ పంచ్ ప్రసాద్ ఎప్పటినుంచో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం తన అభిమాని శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా వీడియో ద్వారా పంచ్ ప్రసాద్ కు కిడ్నీ ఇస్తాను అన్న సంగతి తెలియజేశారు.ఆ వీడియో ద్వారా ఆ అభిమాని ఇలా మాట్లాడుతూ.. ‘‘ప్రసాద్ అన్న నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్‌ను. మీరు ఒంటరిగా ఉన్నపుడు.. మీ ప్రాబ్లమ్‌ను తల్చుకుని మీరెప్పుడైనా బాధపడ్డారా?..మీకు నిజంగా అవసరమైతే నా కిడ్నీ ఇవ్వటానికైనా నేను రెడీ అన్న’’ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నాడు.
అయితే దీని మీద పంచ్ ప్రసాద్ ఎమోషనల్ గా ఇలా స్పందించారు…‘ ఏ రోజూ నాకీ ప్రాబ్లమ్ ఉందని బాధపడలేదు. ఒంటరిగా ఉన్నపుడు కూడా నేను దీని గురించి ఎపుడు ఆలోచించను. ఇది విన్న తర్వాత నా కోసం కిడ్నీ ఇచ్చేంత అభిమానులు ఉన్నారా అని ఇపుడు ఫీల్ అవుతున్నాను .. అయితే ప్రస్తుతం నేను దేవుణ్ణి ఇంకొన్నాళ్లు మిమ్మల్ని నవ్వించే లైఫ్ స్పాన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటూ పంచ్ ప్రసాద్ అభిమాని ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు.


































