కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. రాష్ట్ర పజలకోసం వ్యాక్సిన్లు సేకరించాల్సిన బాధ్యత సీఎం జగన్ కి ఉంది. కానీ ఆయన మాత్రం కేంద్రమే కొనాలని కోరుతూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పంపిన మందులు, వెంటిలేటర్లు, వ్యాక్సిన్లను వినియోగించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వాటిని జగన్ ప్రభుత్వం సరిగా వినియోగించలేదని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతున్న సమయంలో కోవిడ్ నియంత్రణ పై రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదని ఈ విషయంలో ప్రభుత్వం విఫలమవ్వడం వలనే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని విమర్శించారు సోమువీర్రాజు.





























