Janardhan Rao : తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పోలాప్రగఢ జనార్దన్ రావు గారు తన సినిమా విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జెన్నీ గా బాగా ప్రచుర్యం పొందిన ఈయన సినిమాలే కాకుండ పలు సీరియల్స్ లో కూడా నటించారు. ECIL లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సులో కుడా పని చేసారు, ఒక 3 నెలల పాటు యాక్టింగ్ కోర్స్ కుడా చేసిన ఈయన, ఆ అనుభవంతో ఎన్నో చిత్రాలలో, సీరియల్స్ లో మరియు ఎన్నో వేల స్వదేశీ, విదేశీ సినిమా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

బ్రహ్మానందం తో గొడవ… 20 మంది కమెడియన్స్ తో మీటింగ్…
చాలా ఏళ్ల క్రితం సినిమాల్లో అందరు కమెడియన్స్ కి మంచి అవకాశాలతో ఈవివి, జంధ్యాల గారి సినిమాల వల్ల ఎంతో మంది కమెడియన్స్ వచ్చారు. అలా జెన్నీ గారు చాలా మంది కమెడియన్స్ బ్రహ్మానందం, సుత్తివేలు, కోట శ్రీనివాస్రావు, బాబు మోహన్, గుండు హనుమంతరావు, ఏవిఎస్ వంటి వారితో కలిసి చాలా సినిమాల్లో చేసారు. ఇక అలాంటి సమయంలోనే బ్రహ్మానందంతో క్లాష్ వచ్చి వారందరూ కలిసి 20 మంది కమెడియన్స్ ఏవిఎస్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ కి నేను వెళ్ళలేదు.

ఆ తరువాత ఒకసారి ఒక సినిమా షూటింగ్ లో బ్రహ్మానందం కనిపించి మీటింగ్ కి నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగారు. నిజానికి చెప్పాలంటే నన్ను అసలు ఎవరూ పిలవలేదు. ఒకవేళ పిలుచుంటే వెళ్ళేవాడినేమో తెలియదు. ఆ మీటింగ్ కి మీతో గొడవ జరిగిన వాళ్ళు వెళ్లారు నాకు మీతో గొడవ ఏం లేదు కాబట్టి నన్ను పిలవలేదేమో అని నిర్మొహమాటంగా చెప్పడంతో బ్రహ్మానందం అదీ నిజమేలే అని అన్నారు అని ఆ గొడవ గురించి జెన్నీ చెప్పారు. ఇక ఆ గొడవ చిరంజీవి వద్దకు వెళ్ళింది, ఆయన సర్దుబాటు చేసి మీడియా వరకు వెళ్ళకండి అని నచ్చజెప్పడంతో సద్దుమణిగింది అంటూ చెప్పారు.































