నితిన్ “జయం” సినిమాలో “సదా” చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా..?

0
919

“జయం” సినిమా “తేజ” దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అభూతమైన విజయాన్ని అవ్వడమే కాదు ప్రేక్షకుల మనసు కూడా దోచేసుకుంది. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సషనే అని చెప్పాలి. ఈ చిత్రం తేజ తీసిన మూడవ సినిమా ఇది. అంతకు ముందు “చిత్రం”, “నువ్వు నేను” వంటి విజయాలతో మంచి ఫామ్ లో ఉన్నారు దర్శకుడు తేజ. ఈ సినిమాలో “నితిన్, సదా, గోపీచంద్” లకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అంతేకాదు ఈ సినిమాతోనే నితిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇంకా పొతే ఒక కాలేజీ కుర్రాడు అమ్మకి తోడుగా ఉంటూ అడవిలో తేనే పట్టి అమ్ముతుంటాడు. ఆ తరవాత కాలేజీ లో అమ్మాయి పరిచయం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరుగుతుంది. కానీ అప్పటికే ఆ అమ్మాయికి వాళ్ళ బావతో చిన్నప్పుడే పెళ్లి నిశ్చయం అవుతుంది. ఆమె బావ చేతుల్లో ఆ కుర్రాడు తినే దెబ్బలు, చివరికి అమ్మాయి వాళ్ళ బావని కొట్టి ప్రేమలో వి“జయం” పొందుతాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇదే జయం సినిమా కథ. ఈ కథ తోనే తెలుగునాట అద్భుతమైన విజయం సాధించారు తేజ.

ఈ సినిమాలో “సదా” కి చెల్లెలి గా ఒక అమ్మాయి నటించింది గుర్తుందా..? అదే అండి అక్షరాలను రివర్స్ లో రాస్తూ ఉంటుంది. పైగా స్కూల్ లో టీచర్లు రివర్స్ లో నేర్పిస్తున్నారు అని చెపుతుంది. చివర్లో వాళ్ళ అక్క ప్రేమ గెలవాలని రైలు పెట్ట మీద సుద్ద ముక్కతో కూడా రివర్స్ లో రాస్తుంది. చివరికి అది అద్దంలో చూసి అర్ధం చేసుకుంటాడు హీరో. సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటిపోయింది. జయం చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన శ్వేతా యామిని సైతం చదువుల్లో మొదటి నుండి ముందుండేది అందుకే హీరోయిన్ గా అవకాశాలు వద్దనుకుని మొదట క్యాంపస్ ప్లేసెమెంట్స్ ద్వారా విప్రో లో జాబ్ చేసింది ఆ తర్వాత మాస్టర్స్ అమెరికాలోనే పూర్తి చేసి ఆ తర్వాత వరల్డ్ నెంబర్ వన్ సంస్థ అయినా యూనియన్ బెస్ట్ ట్రేడ్ కంపెనీ లో ఉద్యోగం చేసింది. కానీ కొన్ని కారణాల చేత పెళ్లయ్యాక ఫామిలీ బిజినెస్ ని తన భుజాలపై మోస్తుంది శ్వేతా. ఇవ్వండి నటన వదిలి హీరోయిన్స్ చేస్తున్న, చేసిన కీలక ఉద్యోగాలు. అయితే గత ఏడాది ఆమె పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం పెళ్లి తరువాత బాగా ఎంజాయ్ చేస్తుంది.

ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో తెలుసా..? ఓ సారి ఆ అమ్మాయిని లుక్ వేసుకోండి..! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here